నిజమా? హీరోయిన్ అంజలి రహస్య వివాహం?
హైదరాబాద్: ఈ మధ్య కాలంలో తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటున్న భామ హీరోయిన్ అంజలి. తాజాగా తమిళ మీడియాలో అంజలి గురించి ఓ వార్త హాట్ టాపిక్ అయింది. ఆమె తమిళ కమెడియన్ సతీష్ ను రహస్యంగా పెళ్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయం సతీష్ ను అడిగితే షాక్ అయ్యారు. అసలు నేను ఇంత వరకు అంజలిని సినిమాల్లో తప్ప ఎక్కడా చూడలేదు. అలాంటపుడు ఆమెను నేను ఎలా పెళ్లాడతాను? ఇలాంటి రూమర్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అన్నారు.
తెలుగమ్మాయిన అయిన అంజలి...తన పిన్నితో కలిసి చెన్నై వెళ్లి అక్కడ హీరోయిన్ గా నిలదొక్కుకుంది. అయితే దర్శకుడు కళంజియం, ఆమె పిన్నితో గొడవ కారణంగా చెన్నై నుండి హైదరాబాద్ తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. వీరి గొడవకు సంబంధించి కోర్టులో పలు కేసులు కూడా నడుస్తున్నాయి. ఈ గొడవ తర్వాత నుండి అంజలిపై రకరకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.

ఆ మధ్య అంజలికి ఓ తెలుగు నిర్మాతతో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తర్వాత ఆమో ఓ బిజినెస్ మేన్ ను పెళ్లాడినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇపుడు తమిళ కమెడియన్ సతీష్ ను పెళ్లాడినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మొత్తానికి అంజలిపై ఎవరో కావాలని ఇలాంటి రూమర్లు ప్రచారం చేస్తున్నారని ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను బట్టి స్పష్టమవుతోంది.
ఇటీవలే తెలుగులో ‘గీతాంజలి' చిత్రంతో హిట్టు కొట్టిన అంజలి....ప్రస్తుతం తమిళం, కన్నడలో వివిధ చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.


Click it and Unblock the Notifications











