ఆ నటితో పీకల్లోతు ప్రేమలో జై?.. ఫోటోలతో షాకిచ్చిన హీరోయిన్ అంజలి బాయ్‌ఫ్రెండ్!

ఇండస్ట్రీలో ఎప్పుడు? ఎవరు? ప్రేమలో పడతారో? ఎప్పుడు ఎవరు విడిపోతారో తెలియదు. ముఖ్యంగా డైవర్స్, బ్రేకప్స్ వంటివి హాట్ టాపిక్‌గా మారతాయి. ఏళ్లుగా ప్రేమలో ఉన్న వారు ఒక్కసారిగా బ్రేకప్ చెప్పేసుకోవడం, ఎవరి దారి వాళ్లు చూసుకోవడం మాత్రం అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. కానీ ఎవరి జీవితం వాళ్లది. అయితే తమతో విడిపోయిన భాగస్వాములు మరొకరితో ప్రేమలో పడినా, మరొకరిని పెళ్లాడినా తట్టుకోవడం కష్టం. తాజాగా హీరోయిన్ అంజలి ఆమె మాజీ ప్రియుడు జైకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా

అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలుత తెలుగు చిత్ర సీమలో అవకాశాల కోసం ప్రయత్నించినప్పటికీ టాలీవుడ్ తనను పట్టించుకోకపోవడంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు అంజలి. తమిళంలో వరుస హిట్స్‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. పలువురు స్టార్స్‌తో సినిమాలు చేసి నటిగానూ గుర్తింపు పొందారు. వెంకటేశ్ - మహేశ్‌ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో తిరిగి టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అంజలి వరుస అవకాశాలు అందుకున్నారు. స్పెషల్ సాంగ్స్‌తోనూ దుమ్మురేపారు. ఈ ఏడాది శంకర్ - రామ్ చరణ్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజర్‌లోనూ నటించారు.

Anjali Ex Boy Friend Jai dating this young actress - Shocking pic goes viral

సుదీర్ఘకాలం డేటింగ్‌లో జై- అంజలి

అందరు హీరోయిన్ల మాదిరిగానే అంజలి కూడా ప్రేమలో పడ్డారు. జర్నీ సినిమాలో తనతో నటించిన జైతో ఆమె కొన్నేళ్ల పాటు ప్రేమాయణం సాగించారు. ఒకానొకదశలో వీరిద్దరికి పెళ్లికి జరిగిపోయిందని, ఒకే ఇంట్లో ఉంటున్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ వాటిని ఇద్దరూ ఖండించారు. కానీ తమ బంధాన్ని మాత్రం కొనసాగిస్తూనే వచ్చారు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతారని అనుకుంటుండగా .. అనూహ్యంగా అంజలి - జైలు విడిపోయారు. దీనికి కారణాలు ఏంటనేది మాత్రం తెలియరాలేదు. నాటి నుంచి ఎవరి దారులు వారివి అయ్యాయి.

అతనితో రిలేషన్ కొంపముంచింది

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉండటం వల్లే కెరీర్‌పై ఫోకస్ పెట్టలేకపోయానని, రాంగ్ రిలేషన్ అంటూ అంజలి సంచలన వ్యాఖ్యలు చేసింది. అది జై గురించేనా? లేక మరేవరైనా? అని మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ తర్వాత అంజలి ఓ తెలుగు నిర్మాతతో రిలేషన్‌లో ఉన్నారని .. కొద్దిరోజుల్లో వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. మధ్యలో కొన్నిరోజులు అంజలి అదృశ్యం కావడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది.

పక్కన జై, మెడలో తాళితో హీరోయిన్‌

ఇక జై విషయానికి వస్తే అంజలితో విడిపోయినప్పటికీ సెలెక్టివ్‌గా కథలు ఎంచుకుని మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం జై 34, వర్కర్ సినిమాలలో ఆయన నటిస్తున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం యంగ్ హీరోయిన్ ప్రగ్యా నగ్రాతో జై క్లోజ్‌గా ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. మెడలో పసుపు తాడు, నుదిటిన కుంకుమతో ప్రగ్యా ఉండటంతో వీరిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారని గాసిప్స్ వచ్చాయి. చేతిలో పాస్‌పోర్ట్, ఫ్లైట్ టికెట్స్ ఉండటంతో వీరిద్దరూ హనీమూన్‌కి వెళ్తున్నారా ? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Take a Poll

ప్రగ్యా నగ్రాతో క్లోజ్‌గా జై

అయితే ప్రగ్యా నగ్రా- జైలు ఇద్దరూ బేబీ అండ్ బేబీ అనే సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగానే వీరిద్దరూ జంటగా కనిపించారని తర్వాత వార్తలు వచ్చాయి. కానీ విషయం వేరే ఉందని.. ఇద్దరూ ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ గాసిప్స్ వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ అంజలికి మాత్రం ఇది షాకింగ్ న్యూసే అంటున్నారు నెటిజన్లు.

More from Filmibeat

Read more about: anjali jai pragya nagra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X