G-2 : పవన్‌తో వివాదాస్పద హీరోయిన్ అంజలి

By Bojja Kumar

హైదరాబాద్ : ఐదు రోజుల పాటు అదృశ్యమై వివాదాస్పద హీరోయిన్‌గా మారిన అంజలి బంపర్ ఛాన్స్ కొట్టేసిందా? అంటే అవుననే అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందనున్న 'గబ్బర్ సింగ్-2' చిత్రంలో అంజలి ఎంపికయినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ అనే వార్తలు వెలువడ్డాయి. ఏది ఏమైనా అధికారిక ప్రకటన వెలువడితేగానీ ఏవిషయం చెప్పలేం.

Pawan Kalyan-Anjali

గబ్బర్ సింగ్-2 హిందీ వెర్షన్ దబాంగ్-2‌కు రీమేక్ కాదని తాజాగా అందుతున్న ఫిల్మ్ నగర్ సమాచారం. సరికొత్త కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని, పవన్ కళ్యాణ్ మార్కు పూర్తి ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. గతంలో రామ్ చరణ్ హీరోగా సూపర్ హిట్ 'రచ్చ' చిత్రాన్ని తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు సంపత్ నంది...పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందబోయే 'గబ్బర్ సింగ్-2' చిత్రానికి దర్శకుడిగా ఎంపికయ్యారు.

పవన్ కళ్యాణ్ తన సొంత బేనర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బేనర్‌పై దీన్ని సమర్పించనున్నారని, ఆయన స్నేహితుడు శంకర్ మరార్ ఈచిత్రానికి నిర్మాత గా వ్యవహరిస్తారని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు సంపత్ నంది అండ్ టీం 'గబ్బర్ సింగ్-2' ప్రాజెక్టుకు సంబంధించిన పనిలో నిమగ్నమై ఉన్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X