twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బలుపు' ఎఫెక్ట్: అంజలి పెంచేసింది

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు' విజయం సాధించంటంతో వరస ఆఫర్స్ తో బిజీ అయిన అంజలి ...ఇప్పుడు 'బలుపు' కూడా హిట్ బాటలో దూసుకుపోవటంతో ఫుల్ ఖుషీగా ఉంది. అందుకు తగినట్లుగా ఆమె ఇరవై లక్షలు దాకా రెమ్యునేషన్ పెంచేసినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. 'బలుపు' లో ఆమె ఫ్లాష్ బ్యాక్ లో కనపడే డాక్టర్ పాత్రలో కనిపించింది. ఆ లవ్ స్టోరీనే సినిమాకు కీలకం.

    రవితేజ నటించిన 'బలుపు' చిత్రం నిన్న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న రవితేజకు ఈ చిత్రం ఊరటనిచ్చిందనే చెప్పాలి. రవితేజ అభిమానులు కూడా చాలా కాలం తర్వాత తాము కోరుకుంటున్నట్లుగా రవితేజను తెరపై చూసి హ్యాపీగా ఫీలయ్యారు.

    కాగా...ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం 'బలుపు'చిత్రం తొలి రోజు టోటల్‌గా దాదాపు రూ. 6 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఒక ఆంధ్రప్రదేశ్‌లోనే రూ.3.9 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. కచ్చితమైన లెక్కల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. రవితేజ గత సినిమాల ఫలితాల నేపథ్యంలో కాస్త భయపడుతూనే సినిమాను కొన్న బయ్యర్లు తాజా ఫలితాలతో ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    ఇక హీరో రవితేజ కెరీర్‌కు 'బలుపు' చిత్రం బూస్ట్ ఇచ్చిందని చెప్పుచ్చు. వరుసు ప్లాపులతో ప్రేక్షకులను నిరాశపరుస్తూ వచ్చిన రవితేజ 'బలుపు'తో వారి మనసు గెలిచాడని చెప్పొచ్చు. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రంతో మరో మెట్టు పైకెక్కారు. గోపీచంద్ డైరెక్షన్ స్టైల్ బాగుందని, అతనికి మంచి భవిష్యత్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

    English summary
    Anjali created a lasting impression on movie lovers with her everlasting expressions in ‘Seethamma Vakitlo Sirimalle Chettu’. She tasted success with ‘Balupu’ and according to the latest information, she increased her remuneration by Rs 20 lakhs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X