కియారా అద్వానీ బాటలో అంజలి.. ఆ టైపు సినిమాలో నటించేందుకు రెడీ!
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుంటున్న ఈ రోజుల్లో నటీమణులు కూడా కొత్తగా ఆలోచిస్తున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సినిమాలు, ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్‌ల హవా బాగా నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ భామ కియారా అద్వానీ వెబ్ సిరీస్ ద్వారా కూడా మంచి పాపులారిటీ సంపాదించింది. దీంతో ఆమె బాటలోనే ప్రయాణించేందుకు రెడీ అవుతున్నారు నేటితరం హీరోయిన్లు.
తాజాగా హీరోయిన్ అంజలి ఓ వెబ్ సిరీస్ చేస్తోందని సమాచారం. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తమిళంలో ఓ వెబ్ సిరీస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, సుధా కొంగర, వెట్రిమారన్, విఘ్నేష్ శివన్ ఈ వెబ్ సిరీస్ రూపొందించడంలో భాగమవుతున్నారని తెలిసింది. ఒక్కో ఎపిసోడ్ కి ఒక్కొక్కరు చొప్పున ఈ సిరీస్ డైరెక్ట్ చేయనున్నారట. అయితే విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎపిసోడ్‌లో అంజలి ప్రధాన పాత్ర పోషించనుందని సమాచారం.

'షాపింగ్‌మాల్','జర్నీ' లాంటి సినిమాల్లో చక్కటి హావభావాలతో అంజలి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత 2013లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో అలరించింది అంజలి. ఆ వెన్తనె 'బలుపు' 'గీతాంజలి', 'చిత్రంగద' వంటి హారర్ సినిమాలలో తనదైన నటనతో ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే ఈ వేదికపై కియారా అద్వానీ సక్సెస్ అయింది. మరి అంజలికి డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఏ మేర కలిసొస్తుందో చూడాలి!.


Click it and Unblock the Notifications











