twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లారెన్స్ తో తాప్సీకి ...అంజలి ట్విస్ట్..

    By Srikanya
    |

    హైదరాబాద్: ఇప్పుడిప్పుడే సాహసం ఫరవాలేదనిపించుకోవటంతో కాస్త ఊపిరిపీల్చుకుంటున్న తాప్సీకి మరో వైపు నుంచి అంజలి ట్విస్ట్ ఇచ్చింది. లారెన్స్ ని కలిసిన అంజలి...ఆయన తాజా చిత్రంలో మెయిన్ హీరోయిన్ వేషం పట్టేసి...అప్పటికే ఎంపికైన తాప్సీకి నీరసం తెప్పించింది.

    ఇటీవల పిన్నితో చోటుచేసుకున్న మనస్పర్థలను సర్దుబాటు చేసుకున్న అంజలి అదే క్రమంలో కోలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. 'ముని', 'కాంచన'లకు కొనసాగింపుగా రాఘవా లారెన్స్‌ 'గంగా' పేరిట సినిమా తెరకెక్కిస్తున్నాడు. హీరోయిన్ పాత్రకు అంజలిని ఎంపిక చేశారని, ఇందుకు ఆమె కూడా అంగీకరించిందని సమాచారం.

    మరోవైపు ఈ సినిమాలో ఇప్పటికే కీలకపాత్రకు ఎంపికైన తాప్సీ.. అంజలి రాకతో తన పాత్ర ప్రాధాన్యం తగ్గిస్తారేమోనని ఆందోళనలో ఉందట. ఈ విషయమై కోలీవుడ్ వర్గాలు,మీడియా ప్రచారం మొదలెట్టాయి. లారెన్స్ మొదటి తాప్సీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడని,అంజలి ఎంట్రీతో ఆమెను పట్టించుకోవటం మానేసాడని అంటున్నాయి.

    మిగతా వివరాలు స్లైడ్ షోలో...

    రీ ఎంట్రీ

    రీ ఎంట్రీ

    సంచలన నటి అంజలి మళ్లీ కోలీవుడ్‌లో అడుగుపెట్టనుంది.'కట్రదు తమిళ్‌'లో జీవా సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్న అంజలి 'అంగాడితెరు'తో తొలి విజయాన్ని అందుకుంది. ఆపై 'ఎంగేయుం ఎప్పోదుం' తదితర కొన్ని చిత్రాలతో అగ్రస్థానం వైపు అడుగులు వేసింది.

    ఐటం సాంగ్ తో ...

    ఐటం సాంగ్ తో ...

    అగ్ర స్ధానానికి ఎందుగుతున్న సమయంలో ఒక్కసారిగా వివాదాల్లో చిక్కుకుంది. తన పిన్ని, దర్శకుడు హింసిస్తున్నారని ఆరోపిస్తూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. తెలుగులో అవకాశాలు పెరగటంతో తమిళంలో నటించనని పేర్కొంది. అయితే సింగం సీక్వెల్ తో ఐటం సాంగ్ చేసి అక్కడ పరిశ్రమను మళ్లీ ఆకర్షించింది.

    సాహసం

    సాహసం

    తాప్సీ పరిస్ధితి మొదటి నుంచి విచిత్రంగానే ఉంది. ప్లాప్ హీరోయిన్ గా ముద్రపడ్డా ఆఫర్స్ కు లోటు లేకుండా దూసుకుపోతోంది. అయితే ఈ మద్య ఆఫర్స్ క్షీణించాయి. తమిళంలోనూ ఆమెకు అంతంత మాత్రమైన ఆదరణ. ఈ నేపధ్యంలో ఆమెకు సాహసం రూపంలో హిట్టు వచ్చి పడింది. దాంతో ఆమెకు ధైర్యం వచ్చింది.

    ట్విస్ట్ ఇలా..

    ట్విస్ట్ ఇలా..

    అయితే సాహసం సక్సెస్ తాప్సీ కు వరస ఆఫర్స్ ఇవ్వలేకపోయింది. ఆ సినిమాలో ఆమెది గ్లామర్ రోల్ కాకపోవటం మైనస్ గా మారింది. పెద్ద సంస్ధలనుంచి ఆఫర్స్ వస్తాయనుకున్న నేపధ్యంలో ఇలా లారెన్స్ చిత్రంలో సైతం ట్విస్టు పడింది. ఇప్పుడు ఆమెకు అంజలి రూపంలో సమస్య ఎదురైంది

    గంగ

    గంగ

    గంగ టైటిల్ తో తెరకెక్కిస్తున్న లారెన్స్ చిత్రం బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. అందులోనూ గత చిత్రాలు ముని,కాంచన మంచి హిట్ అవటంతో తాప్సీ,అంజలీ ఈ చిత్రంపై ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. లారెన్స్ సైతం మీ పాత్రలు స్పెషల్ గా డిజైన్ చేసానని ఇద్దరికీ చెప్పి ఒప్పించాడని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు.

    English summary
    Anajli who created a buzz in industry with “Seethamma Vakitlo Sirimalle Chettu” is doing a second heroine role in Raghava Lawrence upcoming film “Ganga”(Muni-3) which is the sequel for his “Kanchana”(Muni-2 ). The movie is going to release in both Telugu and Tamil at a same time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X