twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NBK108: బాలయ్య సినిమాలో లేడీ విలన్.. తెలుగు హీరోయిన్‌కు అనిల్ బంపర్ ఆఫర్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని స్టార్‌గా నిలదొక్కుకున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ ఉత్సాహంతోనే ఆయన ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. దీంతో ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకున్నారు. అయితే, ఈ మధ్య కొన్నేళ్ల పాటు బాలయ్యకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ స్టార్ హీరో గత ఏడాది 'అఖండ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆయన మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కారు. అదే సమయంలో కెరీర్‌లోనే భారీ కలెక్షన్లను కూడా అందుకుని రికార్డు నమోదు చేసుకున్నారు.

    బ్రాతో రెచ్చిపోయిన సమంత: అదొక్కటి అడ్డు లేకుంటే ఇక అంతే!బ్రాతో రెచ్చిపోయిన సమంత: అదొక్కటి అడ్డు లేకుంటే ఇక అంతే!

    టాలీవుడ్ పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందిన 'అఖండ' మూవీ రిజల్ట్ ఇచ్చిన జోష్‌తో ఉన్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. తన ఫ్యూచర్ ప్రాజెక్టులను రెట్టించిన ఉత్సాహంతో లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే గత ఏడాది రవితేజతో 'క్రాక్' అనే సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న గోపీచంద్ మలినేనితో ప్రస్తుతం సినిమా చేస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే మొదలైన ఈ మూవీ షూటింగ్.. రెండు మూడు షెడ్యూళ్లను కూడా జరుపుకుంది. ఇందులో బాలయ్య పవర్‌ఫుల్ గెటప్‌తో కనిపిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.

    Anjali Negative Role in Balakrishna and Anil Ravipudi Movie

    గోపీచంద్ మలినేనితో సినిమా పూర్తి అవకముందే నటసింహా నందమూరి బాలకృష్ణ.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ప్రాజెక్టును ఓకే చేసేశారు. ఇప్పటికే ఈ ఇద్దరు స్టార్లూ స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక, ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి తొలిసారి ఓ పవర్‌ఫుల్ సబ్జెక్టును రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్టు వర్కును ఆయన చేస్తున్నారట. ఇది పూర్తైన వెంటనే అంటే జూలై మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.

    ప్రెగ్నెంట్ అయినా తగ్గని హీరోయిన్: హాట్ సెల్ఫీలో ఎద అందాల ఆరబోతప్రెగ్నెంట్ అయినా తగ్గని హీరోయిన్: హాట్ సెల్ఫీలో ఎద అందాల ఆరబోత

    అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ చేయబోతున్న సినిమా ఇంకా ప్రారంభం కాకముందే దీని గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఇందులో ఓ లేడీ విలన్ పాత్ర హైలైట్‌గా ఉండబోతుందట. దీనికోసం తెలుగు హీరోయిన్ అంజలిని తీసుకున్నారని తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన లైన్‌ను కూడా అంజలికి వినిపించారని, ఆ వెంటనే ఆమె ఇందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ రోల్ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని అంటున్నారు. దీంతో అప్పుడే ఈ పాత్రపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

    Anjali Negative Role in Balakrishna and Anil Ravipudi Movie

    గతంలో అంజలి.. నటసింహా నందమూరి బాలకృష్ణతో 'డిక్టేటర్' అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. దీని తర్వాత ఆయన పలు చిత్రాల్లో ఈమె నటిస్తుందని ప్రచారం జరిగింది. కానీ, ఈ కాంబో సెట్ కాలేదు. అయితే, ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాతో ఈ లోటు భర్తీ కాబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ చిత్రానికి 'రామారావు గారు' అనే టైటిల్ పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే.

    English summary
    Nandamuri Balakrishna Will Do a Movie Under Anil Ravipudi Direction. Telugu Actress Anjali to play Negative Role in This Film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X