twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిశ్శ‌బ్దంగా అంజలి చేస్తుంది అదే.. అనుష్కతో కలిసి అలా!

    |

    షాపింగ్‌మాల్,జర్నీ లాంటి సినిమాల్లో చూడచక్కని అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది హీరోయిన్ అంజలి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో తన టాలెంట్ రుజువు చేసుకున్న ఈమె.. ఆ తర్వాత 'బలుపు' 'గీతాంజలి', 'చిత్రంగద' వంటి హారర్ సినిమాలతో మెప్పించింది. ప్రస్తుతం ఈ అమ్మడు మాధవన్‌, అనుష్క హీరోహీరోయిన్లుగా రాబోతున్నసైలెన్స్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.

    సైలెన్స్ సినిమాను తెలుగులో నిశ్శ‌బ్దం పేరుతో తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంలో అంజలి రోల్ గురించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అంజ‌లి సీటెల్‌కు చెందిన పోలీస్ ఆఫీస‌ర్‌గా కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణ కానుందని తెలుస్తోంది. పైగా ఈ పాత్ర కోసం అంజలి కొంత బరువు కూడా తగ్గిందని సమాచారం.

     Anjali role in Anushka Shettys Nishabdam

    హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న నిశ్శబ్దం చిత్రాన్ని కోన వెంక‌ట్‌, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క లీడ్ రోల్ పోషిస్తోంది. భాగమతి తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క సరికొత్తగా ఈ సినిమాలో దర్శనమీయనుందని టాక్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి.

    ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్ పేరు సాక్షి. ఓ మౌన కళాకారిణిగా ఆమె నటిస్తోంది.ఇంకా ఈ చిత్రంలో మాధ‌వ‌న్, షాలినిపాండే, సుబ్బ‌రాజ్, అవసరాల శ్రీనివాస్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ, ఇంగ్లీషు, హిందీ, మ‌ల‌యాళం భాష‌ల్లో భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    After long gap of Bhagamathi Anushka starts a new movie Nishabdam. This movie shooting started in America. In this movie Anjali played a importent role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X