For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనుష్కతో అనుకున్నారు అంజలి తో చేసేస్తున్నారు

  By Srikanya
  |

  హైదరాబాద్ : మొదట ఒకరిని అనుకుని తర్వాత వేరే వారితో సినిమాలు తీయటం సర్వ సామాన్యం. డేట్స్ ఎడ్జెస్ట్ కాకో మరో కారణంతోటే ఇలాంటివి జరుగుతూంటాయి. తాజాగా ఇలాంటిదే ఒకటి చోటు చేసుకుంది. మొదట అనుష్క తో అనుకున్న చిత్రం ఇప్పుడు అంజలితో పూర్తవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

  https://www.facebook.com/TeluguFilmibeat

  కోన వెంకట్ నిర్మాణ సారధ్యంలో రూపొందిన 'గీతాంజలి'లో అందర్నీ భయపెట్టిన తెలుగమ్మాయి అంజలి. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులకు థ్రిల్‌ కలిగించడానికి సిద్ధమవుతోంది. అంజలి ప్రధాన పాత్రలో విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమా సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'పిల్ల జమిందార్‌'తో ఆకట్టుకొన్న అశోక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాత. అమెరికాలో చిత్రీకరణ జరుగుతోంది. జనవరి 10 వరకు అక్కడే కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు. ఆ తరవాత హైదరాబాద్‌లో చిత్రీకరణ కొనసాగిస్తారు. ఇది ఉత్కంఠ, వినోదం జోనర్‌లో సాగే చిత్రమని తెలుస్తోంది.

  Anjali rose scores Anushka’s role

  భాగమతి అనే పేరుతో రూపొందనున్న ఈ సినిమాలోని టైటిల్ పాత్రలో అనుష్క నటించనుందని తొలుత ప్రచారం జరిగింది. ప్రస్తుతం అనుష్క బాహుబలి, రుద్రమదేవి చిత్రాలతో బిజీగా వుండటం వల్ల ఆ స్థానంలో అంజలిని దర్శకనిర్మాతలు ఎంపిక చేసుకున్నారని తెలిసింది. ఆసక్తికరమైన కథ, అభినయానికి ఆస్కారం వుండటంతో అంజలి ఈ సినిమాలో నటిండానికి సుముఖత వ్యక్తం చేసిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

  ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ అంజలి. ఆ తర్వాత తను చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా ఈ సంవత్సరం అంజలి చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘గీతాంజలి' పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలకే కాకుండా లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్ కి కూడా బాగా సరిపోతుందని పేరొచ్చింది. దాంతో అంజలికి మళ్ళీ వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

  ఇటీవలే అంజలి మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తేలియజేశాం. ఆ సినిమాకి భాగమతి అనే టైటిల్ ని ఖరారు చేసారు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా కోసం అంజలి కోటి రూపాయల దాకా పారితోషికం తీసుకున్నట్లు అంటున్నారు. దీన్ని బట్టి సక్సెస్ ఉన్నప్పుడే నాలు రాళ్ళు వెనకేసుకోవాలనే ఫార్ములాని అంజలి బాగా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ‘పిల్లా జమిందార్' ఫేం అశోక్ దర్శకత్వం వహిచబోయే తాజా సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే అనౌన్స్ చేస్తారు.

  English summary
  After the success of the horror-comedy Geetanjali, news is that Anjali has signed her next woman-oriented film Bhagmati. The role which was initially offered to Anushka Shetty will be a gold mine for Anjali; the former turned down the offer citing date problems. There was a buzz in the industry that the movie, which is being directed by Ashok of Pilla Jamindar fame, is an historical drama.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X