రామ్ చరణ్‌తో అంజలి ఐటం సాంగ్? షాకింగ్ రేటు...!

By Bojja Kumar

హైదరాబాద్: శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ త్వరలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుగనుంది. ఈ చిత్రంలో ఐటం సాంగు కోసం హీరోయిన్ అంజలిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట శ్రీను వైట్ల. ఈ మేరకు ఆమెను సంప్రదించగా రూ. కోటి రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. హీరోయిన్ తో సమానంగా అమ్మడు ఐటం సాంగుకు డిమాండ్ చేయడంతో అంతా షాకయ్యారట. రెమ్యూనరేషన్ తగ్గించాలని సంప్రదింపులు జరుపుతున్నారట. త్వరలో ఏ విషయం అనేది తేలనుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Anjali's shocking price for an item song

ఈ చిత్రంలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే రామ్ చరణ్ తో ఆమె చేస్తున్న తొలి సినిమా ఇదే కానుంది. సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉంటుందని టాక్. సినిమాకు సంబంధించిన పేపర్ వర్క్ కంప్లీట్ కావాల్సి ఉందని, త్వరలో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ విషయమై ఇప్పటి వరకు అటు రామ్ చరణ్ నుండి గానీ, ఇటు శ్రీను వైట్ల నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

మరో వైపు గీతా ఆర్ట్స్ బేనర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు. ఇటీవలే ‘రేసు గుర్రం' సినిమాతో భారీ విజయం సొంతం చేసుకున్న సురేందర్ రెడ్డి రామ్ చరణ్ కోసం అదిరిపోయే సినిమా ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ - శ్రీను వైట్ల సినిమా, సురేందర్ రెడ్డి ప్రస్తుతం చేస్తున్న ‘కిక్ 2' సినిమా పూర్తి అయిన తర్వాత ఆ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X