అనుష్క ఆఫర్..అంజలి ఎగరేసుకుపోయింది
హైదరాబాద్ : ఒకరితో అనుకున్న ప్రాజెక్టు మరొకరితో పట్టాలు ఎక్కడం సినీ పరిశ్రమలో అత్యంత సహజం. అలాగే...ఇప్పుడు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి చిత్రాల హీరోయిన్ అంజిలికు ఇప్పుడో ఆఫర్ దొరికిందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అనుష్క తో అనుకున్న ప్రాజెక్టుని ఆమె డేట్స్ లేటవుతూండటంతో అంజలితో ప్రొసీడ్ అవుతున్నట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... పిల్ల జమీందార్ దర్శకుడు అశోక్ ..ఆ మధ్యన భాగమతి అనే టైటిల్ తో ఓ చిత్రం అనుకుని దాన్ని అనుష్క తో చేద్దామని ప్రయత్నాలు చేసారు. మిర్చి నిర్మాతలు దాన్ని ప్రొడ్యూస్ చేయటానికి ముందుకు వచ్చారు. అయితే అనుష్క రోజు రోజుకూ పెద్ద ఆపర్స్ తో వరస బిజీ అవుతూండటంతో ఆమె డేట్స్ దొరికేటట్లు లేవని భావించిన అశోక్...అంజలితో ముందుకు వెళ్లాలని నిర్ణయిం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక భాగమతి చిత్రం అందరూ ఊహిస్తున్నట్లు చారిత్రక కథాంశం కాదని తెలుస్తోంది. ఆ చిత్రం పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్ గా నడుస్తుందని, కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ సైతం ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. అశోక్ ఈ చిత్రంతో తిరిగి ఫామ్ లోకి రావాలని భావిస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంభందించిన పూర్తి వివరాలు తెలిసే అవకాసం ఉంది.
'బాహుబలి', 'రుద్రమదేవి' తరవాత అనుష్క నటించే చిత్రం ఏమిటి? అనే విషయంలో ఇంకా ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఈరెండూ ఒప్పుకొని యేడాది దాటింది. ''వర్ణ, బాహుబలి, రుద్రమదేవి ఈ సినిమాల కోసం అనుష్క భారీ మొత్తంలో కాల్షీట్లు ఇచ్చింది. రెండేళ్లుగా క్షణం తీరిక లేదు. అందుకే 'రుద్రమ దేవి', 'బాహుబలి' తరవాత కాస్త విరామం తీసుకోవాలని భావిస్తోంది. ఈ చిత్రాల ఫలితాలు చూసి తన కెరీర్‌ని మార్చుకోవాలన్న ఆలోచనలో ఉంది..'' అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











