ఆమె రామ్ గోపాల్ వర్మ కొత్త గర్ల్ ప్రెండా?
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి గర్ల్ ప్రెండ్ గా మరో ముద్దుగుమ్మ చేరిందంటున్నారు. డాన్ శీను చిత్రంలో రవితేజ సరసన సెకెండ్ హీరోయిన్ గా చేసిన అంజనా సుఖాని గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా తర్వాత ఆమె పాపం ఆఫర్స్ ఏమి పట్టలేకపోయింది.తాజాగా ఆమె ను రామ్ గోపాల్ వర్మ తన డిపార్టమెంట్ లోకి తీసుకున్నారు.కంగనా రౌనత్ ని తీసేసి ఆమెను తీసుకున్నాడని టాక్.
దాంతో కంగనా ఆయనపై మండిపడుతోంది .అంతేగాక అంజనాకు బెజవాడ రౌడీలు చిత్రంలో ఓ ఐటం సాంగ్ కూడా ఏర్పాటు చేయించారు.అలాగే మరో రెండు ప్రాజెక్టులలో ఆమెను తీసుకుంటానని హామీ కూడా ఇచ్చారుట.ఇదంతా చెప్పుకుని ఆమె మురిసిపోతోందంటూ ముంబై మీడియా వ్యాఖ్యానం చేస్తోంది.ఇక బెజవాడ రౌడీలు చిత్రంలో ఆమె ఫెరఫార్మెన్స్ చూసిన వర్మ తనకు అవకాసమిచ్చాడని చెప్తోంది.ఇక త్వరలో ప్రారంభమయ్యే డిపార్టమెంట్ లో అమితాబ్,రానా,సంజయ్ దత్ ప్రధానపాత్రలలో చేయనున్నారు.పోలీస్ డిపార్టమెంట్ నేపధ్యంలో జరిగే కథ ఇది.


Click it and Unblock the Notifications











