Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కళ్యాణ్ కోసం సిద్ధంగా ఉన్న మరో స్టార్ డైరెక్టర్.. మహేష్ కంటే ముందుగానే..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ ఎలా సరికొత్త కాంబినేషన్స్ తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా మన స్టార్ హీరోలు కొత్త దర్శకులు కూడా అవకాశాలు ఇస్తున్నారు. చేసిన దర్శకులతో మరోసారి సినిమాలు చేయకుండా విభిన్నమైన దర్శకులను కూడా లైన్లో పెడుతున్నారు. ఇక నిర్మాతలు కూడా బడ్జెట్ విషయాలలో అంచనాలకు తగ్గట్లుగా.. నిర్ణయాలు తీసుకోవడం విశేషం. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెడీ అంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న మరికొందరు టాప్ దర్శకులు కూడా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఇటీవల మరొక దర్శకుడితో చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
Recommended Video
జెట్ స్పీడ్ లో సినిమాలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అత్యధిక సినిమాలను ఒకేసారి లైన్ లో పెట్టడం విశేషం. ఒక సినిమా తర్వాత మరొక సినిమాను జెట్ స్పీడ్‌లో రిలీజ్ చేస్తున్నాడు. వకీల్ సాబ్ సినిమా తర్వాత వెంటనే భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నాడు. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా ఆ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఆ సినిమా సంక్రాంతి కానుకగా భారీ బాక్సాఫీస్ ఫైట్ లో పోటీకి దిగనుంది.
మొదటిసారి అలాంటి సినిమాతో..
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా తర్వాత హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరపైకి రాబోతున్న ఆ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. దర్శకుడు క్రిష్ మొదటిసారి పవర్ స్టార్ తో చేస్తున్న సినిమా కాబట్టి చాలా విభిన్నంగా ఉండబోతోందని అర్థమవుతోంది. ఆ సినిమా హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కనుంది ఖుషి నిర్మాత ఏ.ఎం రత్నం ఆ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
సందేశాత్మక సినిమాలు
ఇక పవన్ కళ్యాణ్ లిస్టులో హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరొక యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలలో కూడా మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు సామాజిక సందేశం కూడా ఉంటుందని దర్శకులు ఇద్దరు కూడా ఇదివరకే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు మరో ఇద్దరు దర్శకులు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అనిల్ రావిపూడి కూడా
ఇటీవల నిర్మాత దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో మరొక పేమెంట్ తీసుకున్నట్లు సమాచారం. ఆ లిస్టులో అనిల్ రావిపూడి కూడా ఉన్నట్లు క్లారిటీ వచ్చేసింది. కుదిరితే వచ్చే ఏడాది పరిస్థితిని బట్టి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం F3 సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న అనిల్ ఆ తర్వాత బాలకృష్ణ సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నాడు.
మహేష్ కంటే ముందే..
ఇక పవన్ కళ్యాణ్ ఓకే చెబితే ఆయనతో కూడా వీలైనంత తొందరగా ప్రాజెక్టు మొదలు పెట్టే అవకాశం ఉంది. అలాగే అనిల్ రావిపూడి మహేష్ బాబు తో కూడా ఒక సినిమా చేయడానికి కమిట్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందే కుదిరితే పవన్ తో సినిమాను స్టార్ట్ చేసే అవకాశం ఉంటుందట.