twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆదిపురుష్ రిలీజ్ పై మరో కన్ఫ్యూజన్.. అలా జరిగితే మరింత ఆలస్యం?

    |

    రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి అనంతరం వరుసగా పాన్ ఇండియా సినిమాలను ఎనౌన్స్ చేశాడు కానీ ఆ సినిమాలేవి కూడా అంచనాలను అందుకోవడం లేదు. విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేస్తున్నప్పటికీ విడుదల తర్వాత మాత్రం దారుణమైన ఫలితాన్ని అందుకుంటున్నాయి. ఇక ఇటీవల ఆదిపురుష్ సినిమా అయితే మరి దారుణంగా ట్రైలర్ తోనే తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. సరికొత్త టెక్నాలజీతో దర్శకుడు సినిమాలో తెరపైకి వస్తాడు అనుకుంటే చిన్నపిల్లల తరహా కార్టూన్ గ్రాఫిక్స్ తో షాక్ ఇచ్చాడు అని ఫ్యాన్స్ అందరు కూడా అప్సెట్ అయ్యారు.

    అంతేకాకుండా ఆ సినిమాపై ఊహించని స్థాయిలో ట్రోలింగ్ కూడా నడిచింది. ఇక వెంటనే ప్రభాస్ జోక్యం చేసుకొని సినిమాకు తగ్గట్టుగా గ్రాఫిక్స్ లో చాలా మార్పులు చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఇక సినిమాలో గ్రాఫిక్స్ లో చాలా మార్పులు చేయాలి అని మరికొంత సమయం కూడా తీసుకున్నారు. అందుకే జనవరికి రావాల్సిన ఈ సినిమాను 2023 సమ్మర్ కు వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న మరొక టాక్ ప్రకారం ఆదిపురుష్ సినిమా ఆ సమయానికి కూడా రాకపోవచ్చు అని తెలుస్తోంది.

    Another confusion on adipurush movie release date

    ఎందుకంటే మరికొన్ని సన్నివేశాలు రీశుట్ చేయాల్సిన అవసరం కూడా ఉందని తెలుస్తోంది. దర్శకుడు మారుతి సినిమాను కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ప్రభాస్ ఆదిపురుష్ విషయంలో కాస్త సీరియస్గా ఆలోచించి మళ్లీ మరికొన్ని సన్నివేశాలను రీ షూట్ చేసే విధంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే సినిమా మళ్ళీ 2024లో విడుదల అయ్యే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా సలార్ సినిమాతో పాటు మారుతి సినిమా కూడా వచ్చి ఏడాదిలోనే విడుదల చేస్తారు. కాబట్టి వెంట వెంటనే సినిమాలు విడుదలయితే బాగుండదు అని అందుకే ఆదిపురుష్ సినిమాను కొంత ఆలస్యంగా విడుదల చేసే ఛాన్స్ ఉంది. మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

    English summary
    Another confusion on adipurush movie release date
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X