RRRలో మరో కన్ఫ్యూజన్.. ఆ హీరోయిన్ విదేశాల నుంచి రాగలదా?
దర్శకధీరుడు రాజమౌళి కెరీర్ లో మొదటిసారి చేస్తున్న బిగెస్ట్ మల్టీస్టారర్ RRR మూవీకి ఊహించని సమస్యలు ఎదురవుతున్నాయి. ఆయితే అన్ని సమస్యలకు ఒకే ఒక్క కారణం.. కరోనా. ఈ వైరస్ ప్రభావం మిగతా సినిమాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో తెలియదు గాని RRR పై మాత్రం గట్టి ప్రభావమే చూపుతోంది. రాజమౌళి తన కెరీర్ లో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఇబ్బంది పడలేదు.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాకు సంబంధించిన షూటీంగ్ ఇంకా 25% పూర్తి కావాల్సి ఉందని సమాచారం. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఇక షూటింగ్ లో విదేశీ భామ ఒలీవియా మోరిస్ కూడా పాల్గొనాల్సి ఉంది. అలియా భట్ తో షూట్ చేయాల్సిన సన్నివేశాలు కూడా చాలానే ఉన్నాయి. అలియా భట్ అంటే ఎప్పుడైనా షూటింగ్ కి వచ్చేస్తుంది. కానీ బ్రిటన్ నుంచి ప్రస్తుత పరిస్థితులలో ఒలీవియా రావాలి అంటే కష్టమైన పనే.

దేశ విదేశాలకు చాలా వరకు రాకపోకలు తగ్గాయి. ఇక విదేశాల నుంచి ఒలీవియా ఇలాంటి భయంకరమైన సమయంలో ధైర్యం చేసి రాగలదా అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ సంగతి పక్కనపెడితే ఇప్పట్లో అసలు షూటింగ్స్ స్టార్ట్ అవుతాయా అనేది పెద్ద కన్ఫ్యూజన్ గా మారింది. పరిస్థితి అదుపులోకి వస్తే వెంటనే షూటింగ్స్ స్టార్ట్ చేయాలని చాలా మంది రెడీగా ఉన్నారు. కానీ మరి కొన్నాళ్ల వరకు షూటింగ్స్ పెద్దగా జరగకపోవచ్చని అనుమానాలు వస్తున్నాయి. దీంతో RRR సమ్మర్ లో కూడా వచ్చే అవకాశం లేదని టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











