twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో భక్తిరస చిత్రానికి నాగార్జున గ్రీన్ సిగ్నల్, డైరక్టర్ మాత్రం రాఘవేంద్రరావు కాదు

    నాగార్జున మరో భక్తిరస చిత్రంలో చేయటానికి సిద్దం అవుతున్నారు.

    By Srikanya
    |

    హైదరాబాద్: నాగార్జున మరో భక్తిరస చిత్రంలో కనపించనున్నారా అంటే అవుననే వినపడుతోంది. 'అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి' చిత్రాలతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆయన త్వరలోనే 'ఓం నమోవెంకటేశాయ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఓం నమో వేంకటేశాయ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో నాగార్జున ఓ కామెంట్ చేశారు. రచయిత జే.కే. భారవి తీసుకొచ్చిన మరో స్క్రిప్ట్ విపరీతంగా ఆకట్టుకుందని.. చెప్పాడు నాగార్జున. ఇది కూడా భక్తిరస చిత్రమే అని తెలుస్తోంది.

    అయితే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ చిత్రం డైరక్ట్ చేయటం లేదని సమాచారం. 'అన్నమయ్య, శ్రీరామదాసు, ఓం నమోవెంకటేశాయ' చిత్రాలకు మాటల రచయితగా వ్యవహరించిన భారవి, నాగార్జున హీరోగా ఇస్కాన్ ఫౌండర్ శ్రీ ప్రభుపాద జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

    Another devotional film for Nagarjuna?

    ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధిన కథను నాగార్జునకు వినిపించారని, ఓం నమోవెంకటేశాయ విడుదలయిన తర్వాత నాగార్జున ఓ నిర్ణయం తీసుకుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఓం నమోవెంకటేశాయ తర్వాత కూడా నాగార్జున మరో భక్తిరస చిత్రాన్ని ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది. నాగార్జున ఈ చిత్రంలో హీరోగా నటిస్తే.. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసేందుకు ఇస్కాన్ వాళ్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తోంది.

    త్వరలోనే 'ఓం నమోవెంకటేశాయ' చిత్రంతో నాగార్జున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వచ్చే నెల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

    ఈ సినిమాలో శ్రీవారి భక్తుడు హథీరాం బాబాగా నాగార్జున, కృష్ణమ్మ అనే భక్తురాలిగా అనుష్క నటించారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం కోసం పలు భారీ సెట్లు నిర్మించి చిత్రీకరణ జరిపారు.

    'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడిసాయి' తర్వాత నాగార్జున - కె.రాఘవేంద్రరావు కలయికలో తెరకెక్కుతున్న మరో భక్తిరస ప్రధాన చిత్రం ఇది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలో అనుష్క, ప్రగ్యా జైశ్వాల్, జగపతి బాబు, విమలా రామన్‌‌లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సౌరభ్ జైన్ వేంకటేశ్వర స్వామి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    “J.K. Bharavi narrated the short version of Swami Prabhupada story to Nagarjuna and the actor has still not yet decided. But there is a potential story on how Prabhupada became the guru and started the Hare Krishna movement,”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X