ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ నుంచి షాకింగ్ న్యూస్: ఏకంగా ఆరుగురు హీరోలు.. ఏ రోల్స్ చేస్తున్నారంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అలాంటి వాటిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక ఒకటి. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయాలని నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా చాలా కాలంగా వేచి చూశారు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ కలిసి 'అరవింద సమేత' అనే సినిమా చేసి హిట్ కొట్టారు. దీని తర్వాత మరోసారి ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

ఎన్టీఆర్ వరుసగా.. త్రివిక్రమ్ ఇండస్ట్రీ హిట్

ఎన్టీఆర్ వరుసగా.. త్రివిక్రమ్ ఇండస్ట్రీ హిట్

కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి హిట్లతో సత్తా చాటిన అతడు ప్రస్తుతం RRR మూవీలో నటిస్తున్నాడు. మరోవైపు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. అల్లు అర్జున్‌తో 'అల.. వైకుంఠపురములో'తో ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడు.

ఎప్పుడో ప్రకటించారు... ఆ వివరాలు ఇవే

ఎప్పుడో ప్రకటించారు... ఆ వివరాలు ఇవే

'అరవింద సమేత' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత త్రివిక్రమ్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్లపై నందమూరి కల్యాణ్ రామ్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కానీ, కియారా అద్వాణీ కానీ ఇందులో లీడ్ హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఉన్నాయి.

ఈ సారి రాజకీయ నేపథ్యంతో వస్తున్నారు

ఈ సారి రాజకీయ నేపథ్యంతో వస్తున్నారు

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఢిల్లీ కేంద్రంగా జరిగే రాజకీయ నేపథ్యంతో ఈ చిత్రం రూపొందనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇందులో తారక్.. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గానూ, పొలిటీషియన్‌గానూ కనిపించబోతున్నాడనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.

పాన్ ఇండియా రేంజ్‌తో.. అన్నీ పక్కాగానే

పాన్ ఇండియా రేంజ్‌తో.. అన్నీ పక్కాగానే

ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌తో తీసుకు రాబోతున్నారన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ ప్రాజెక్టు విషయంలో అన్నీ పక్కాగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ అప్పీల్ ఉండేలా కొందరు నటీనటులను దించుతున్నారని తెలుస్తోంది. అలాగే, బడ్జెట్ విషయంలోనూ పరిమితులు లేవని టాక్.

ఈ సినిమాలో మొత్తం ఆరుగురు హీరోలు

ఈ సినిమాలో మొత్తం ఆరుగురు హీరోలు

టాలీవుడ్‌లోనే క్రేజీ కాంబినేషన్‌ కావడంతో 'అయిననూ పోయి రావలె హస్తినకు'పై భారీ అంచనాలు ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడట త్రివిక్రమ్. ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ కాకుండా.. ఈ చిత్రంలో పలు ఇండస్ట్రీలకు సంబంధించిన మరో ఐదుగురు హీరోలను కూడా నటింపజేస్తున్నాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

ఏ హీరో ఏ రోల్ చేస్తున్నాడో.. అలా ప్రచారం

ఏ హీరో ఏ రోల్ చేస్తున్నాడో.. అలా ప్రచారం

తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో అప్పటి ఇప్పటి హీరోలు నటిస్తున్నారట. కన్నడ పరిశ్రమకు చెందిన ఉపేంద్ర పొలిటీషియన్‌గా, జయరాం వ్యాపారవేత్త పాత్రలు పోషిస్తున్నారట. అలాగే, తెలుగు నుంచి రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ తండ్రిగా, సునీల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నారట. అలాగే, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X