For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాబు కష్టమే... : మళ్లీ ఇంకో ఫ్లాఫ్ ఇచ్చాడు

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఫెయిల్యూర్స్ రావటం చాలా చాలా ఈజి. కానీ దాన్నుంచి బయిటపడటం అనుకున్నంత ఈజీ మాత్రం కాదు. ఈ విషయం ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్న హీరోలకు అందరికన్నా ఎక్కువ తెలుసు. ఒక ఫెయిల్యూర్ నుంచి బయిటపడటానికి ఆచి తూచి అడుగు వేస్తున్నామనుకుంటూ ఇంకో ఫెయిల్యూర్ ని ఆహ్వానిస్తూంటారు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ పరిస్ధితి అలాగే ఉంది. చాలా కాలంగా హిట్ మొహం ఎరగని ఆయన తాజాగా చేసి ఈ శనివారం విడుదలైన ‘‘ఈ వర్షం సాక్షిగా' చిత్రం సైతం భాక్సాఫీస్ వద్ద ఫ్లాఫ్ టాక్ ని తెచ్చుకుంది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  చిత్రం కథేమిటంటే...

  జీవితంలో ఎటువంటి ధ్యేయం లేకుండా ...తనకు ఓ గర్ల్ ఫ్రెండ్ దొరికితే చాలు అనుకునే కుర్రాడు జై (వరుణ్ సందేశ్). అయితే అతను ఎప్పుడూ అమాయకంగా అమ్మాయిల చేతిలో మోసపోతూంటాడు. ఒకరోజు తనకు ఎక్కడో దూరం బంధువు ఇంట్లో బారశాలకు బయిలుదేరిన అతనికి రైలు ప్రయాణంలో మహాలక్షి (హరిప్రియ) కనిపిస్తుంది. వెంటనే..ఆలస్యమెందుకు అన్నట్లు ఆమెను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఇంటికి చేరుకున్న తర్వాత మహాలక్ష్మికి తన మనసులో ప్రేమను వ్యక్తం చేయాలనే నిర్ణయం తీసుకుంటాడు. వెంటనే మహాలక్ష్మి సొంతూరికి ప్రయాణం వెళ్తాడు. అయితే అక్కడో ట్విస్ట్... ఆమె మరొక వ్యక్తితో ఇల్లు విడిచి వెళ్లిపోయింది. అప్పుడు ఏం జరిగింది. మహాలక్ష్మి ఏమైంది...అనే విషయాలతో నడిచేదే మిగతా కథ.

  Another flop for Varun Sandesh

  వరుణ్ సందేశ్ మాత్రం ఈ చిత్రంపై చాలా పాజిటివ్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ...‘‘ఈ మధ్య కాలంలో నేను చేసిన నాలుగైదు సినిమాల్లో ఈ సినిమా ఓపినింగ్స్‌ చాలా బావున్నాయి. సినిమాకు చక్కని స్పందన వస్తోంది'' అని అన్నారు వరుణ్‌ సందేశ్‌. రమణ మొగిలి దర్శకత్వంలో వరుణ్‌ సందేశ్‌, హరిప్రియ జంటగా నటించిన చిత్రం ‘ఈ వర్షం సాక్షిగా'. రాహుల్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై బి..ఓబుల్‌ సుబ్బారెడ్డి నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా.

  వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ ‘‘ఇటీవల నేను అందుకున్న హిట్‌ సినిమా ఇది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు వస్తోన్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది'' అని అన్నారు.

  దర్శకుడు మాట్లాడుతూ ‘‘చిన్న సినిమాగా మొదలైన సినిమా ఇది. 160 థియేటర్‌లో విడుదల చేసి పెద్ద సినిమాగా నిలబెట్టారు మా నిర్మాత. టీమందరి కృషితోనే ఈ సక్సెస్‌ సాధ్యమైంది'' అని అన్నారు.

  నిర్మాత మాట్లాడుతూ ‘‘భోజపురిలో రెండు సినిమాలు తీశాను. తెలుగులో మొదటి సినిమా ఇది. ప్రేక్షకులకు బాగా చేరువైంది. జబర్ధస్త్‌ టీమ్‌ కామెడీ ఆకట్టుకుంటోంది'' అని తెలిపారు.

  హరిప్రియ మాట్లాడుతూ ‘‘మా టీమందరితో సంధ్య ధియేటర్‌లో సినిమా చూశాను. ఆడియన్స్‌ సినిమాను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. బెంగుళూరులో నా ఫ్రెండ్స్‌ కూడా సినిమా చూసి చాలా బావుందని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది'' అని అన్నారు.

  English summary
  Varun Sandesh has added another flop to the list with the recently released Ee Varsham Sakshiga.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X