పవన్,త్రివిక్రమ్ చిత్రం టైటిల్ పై మరో రూమర్

By Srikanya

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ చిత్రం టైటిల్ ఇప్పటి వరకూ ఏదనేది ఖరారు చేయలేదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. మొన్నటివరకూ సరదా, హరే రామ హరే కృష్ణ టైటిల్స్ దుమ్ము దులిపి వదిలాయి. తాజాగా మరో టైటిల్ ఈ చిత్రానికి పెట్టనున్నారంటూ వెబ్ లోనూ, సినీ వర్గాలలోనూ ప్రచారమవుతోంది. ఆ టైటిల్ ఏమిటంటే..." అత్తారింటికి దారేది ". అచ్చ తెలుగు టైటిల్ గా దీన్నే పెట్టే అవకాసం ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకూ టైటిల్ విషయమై అథికారికంగా ఏ ప్రకటనా రాలేదు.

ఇక ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 3 కోట్ల ఖర్చుతో సెట్ వేసారు. ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర పర్యవేక్షణలో ఈ ఖరీదైన సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈచిత్రంలో పవర్ స్టార్ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడని, అతని క్యారెక్టరైజేషన్ కూల్ గా, హాస్య భరితంగా ఉంటుందని అంటుందని ఫిల్మ్ నగర్ టాక్. త్వరలో పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

'మిర్చి' చిత్రంలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించిన నదియా ఈ సినిమాలో సమంత తల్లి పాత్రలో నటించబోతోంది. అదే విధంగా బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ కూడా ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. మరో వైపు టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం రియల్ ఎస్టేట్ దాదాగా కనిపించబోతున్నారని తెలుస్తోంది.

బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సినిమా ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సినిమా టైటిల్‌తో అన్ని వివరాలను త్వరలో అఫీషియల్ గా ప్రకటించనునున్నారు నిర్మాతలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X