NTR30: ఎన్టీఆర్ మూవీలో మరో హీరో, హీరోయిన్.. ఆమె ఫిక్స్.. అతడు మాత్రం!
వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న విషయం తెలిసిందే. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను అంగరంగ వైభవంగా మొదలు పెట్టడంతో పాటు రెండు భారీ యాక్షన్ షెడ్యూళ్లను విజయవంతంగానే పూర్తి చేసుకున్నారు.
పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో ఎంతో మంది స్టార్లు భాగం అవుతోన్నారు. ఇందులో భాగంగానే ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో మరో హీరోయిన్ పాత్రను కూడా డిజైన్ చేశారట. దీనికి
బాలీవుడ్ బ్యూటీ, లైగర్ ఫేం అనన్య పాండేను ఎంపిక చేసుకున్నారని తెలిసింది. అంతేకాదు, దీనికి సంబంధించిన ప్రకటనను ఈ రెండు మూడు వారాల్లోనే వదలబోతున్నారని తెలుస్తోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ఐదు భాషల్లో రూపొందుతుండడంతో నేషనల్ క్రేజ్ ఉన్న చాలా మంది నటీనటులను తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమా కోసం టాలీవుడ్‌కు చెందిన ఓ పేరున్న హీరోను సెలెక్ట్ చేశారని అంటున్నారు. ఆయన పాత్ర సినిమాను మలుపు తిప్పేదిగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ రోల్ చేసే హీరో గురించి మాత్రం రివీల్ చేయరని విశ్వసనీయంగా తెలిసింది. మొత్తానికి ఇందులో మరో హీరో, హీరోయిన్ కూడా భాగం అవుతున్నారన్న మాట.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











