విక్రమార్కుడు 2లో రవితేజ అనుమానమే.. మరోక హీరో కోసం సెర్చింగ్?

మాస్ మహారాజా రవితేజ సినిమా జీవితంలో ఎన్నో బాక్సాఫీస్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే అందులో మాత్రం ఎక్కువగా ప్రజాదరణ పొందిన సినిమాల్లో విక్రమార్కుడు టాప్ లిస్టులో ఉంటుందని చెప్పవచ్చు. ఆ సినిమా దర్శక ధీరుడు రాజమౌళి కెరీర్లో కూడా సరికొత్త రికార్డ్ లను క్రియేట్ చేసింది. ఈ సినిమా చేయడానికి దర్శకుడు రాజమౌళి డైరెక్టర్ కాక ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడట. కానీ మొదట్లోనే అలాంటి సినిమా చేయడం సేఫ్ కాదని స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా చేశాడు. కమర్షియల్ గా అన్ని అంశాలను బ్యాలెన్స్ చేయడం అంటే అంత సాధారణ విషయం కాదు. కానీ విక్రమార్కుడు సినిమాలో ఒక సాధారణ ప్రేక్షకుడి నుంచి అలాగే విభిన్నమైన సినిమాలని ఇష్టపడే వారికి కూడా ఎంతగానో నచ్చుతుంది.

ఇక సినిమాలో రెండు పాత్రల్లో నటించిన రవితేజ ఎంతగానో మెప్పించాడు. ఒకవైపు అత్తిలి సత్తిబాబుగా నవ్విస్తూనే మరొకవైపు విక్రమ్ రాథోడ్ అనే పాత్రలో చాలా సీరియస్ గానే కాకుండా ఎంతో ఎమోషనల్ గా కూడా ఆకట్టుకున్నాడు. సినిమా తప్పకుందా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ షూటింగ్ దశలోనే ఫిక్స్ అయింది. తర్వాత ఆ స్థాయిలో బాక్సాఫీస్ వసూళ్లకు అడ్డుకుంటుందని ఎవరూ ఊహించలేదు. విక్రమార్కుడు సినిమా తర్వాత రాజమౌళి స్థాయి మరింత పెరిగిపోయింది. ఇక మళ్లీ ఆ సినిమా కథను కొనసాగించి సీక్వెల్ ను సిద్ధం చేయాలని రచయిత విజయేంద్రప్రసాద్ సరి కొత్తగా ఆలోచించాడు.

Another hero for ravi teja Vikramarkudu 2 project

కథ అసలు పాయింట్ గత కొన్నేళ్ల క్రితమే సిద్ధం చేసిన విజయేంద్ర ప్రసాద్ ఇటీవల పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేయడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. మొత్తానికి సినిమా స్క్రిప్ట్ అయితే సిద్ధమైంది. దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఇలాంటి లోకల్ కమర్షియల్ కథను డైరెక్ట్ చేసే అవకాశం లేదు. అసలు సమయం కూడా లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే RRR రిలీజ్ అనంతరం మహేష్ సినిమాతో బిజీ కానున్నాడు.. కాబట్టి విక్రమార్కుడు సినిమా కోసం సమయాన్ని కేటాయించే అవకాశం అయితే లేదు.

మరో వైపు రవితేజది కూడా అదే పరిస్థితి. చాలా కమిట్మెంట్స్ ఉండిపోవడం వలన ఇప్పట్లో మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే అవకాశం లేదట. దీంతో ఆ ప్రాజెక్టు ను మరొక హీరో చేసే అవకాశం ఉంది. ఇక దర్శకుడి విషయంలో అయితే సంపత్ నంది సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక సంపత్ నంది ఎంతవరకు న్యాయం చేస్తాడో గాని కానీ రవితేజ కాకుండా ఇలాంటి కథలో మరొకరికి ఊహించుకోవడం అంటే అంత ఈజీ కాదు. ప్రేక్షకులను ఒప్పించాలంటే చాలా కష్టమైన పని. మరి సీక్వెల్ విషయంలో దర్శకుడు ఏ విధంగా ఆలోచిస్తారో చూడాలి. ఇక సంపత్ నంది ఇటీవల సీటిమార్ సినిమాతో వచ్చిన విషయం తెలిసిందే. కానీ సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఇక అతని మేకింగ్ విధానం నచ్చి కొందరు నిర్మాతలు ఆఫర్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ తో కూడా ఇటీవల ఒక కథపై చర్చలు జరిపినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X