Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పవన్ సినిమాపై మరో షాకిచ్చే రూమర్.. ఈ సారి లిస్టులోకి గోపీచంద్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత ఎవరు ఊహించని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. నమ్మలా వద్దా అని అనుకుంటున్నా తరుణంలోనే మరొక గాసిప్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. నిజంగా ఈ కాంబో సెట్టయితే బావుంటుంది అని ఆడియెన్స్ కూడా మనసులో చాలా బలంగా కోరుకుంటున్నారు. ఇక ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాపై రూమర్స్ రావడం హాట్ టాపిక్ గా మారుతోంది.
రూమర్స్ ఎన్ని వస్తున్నా.. ఆన్సర్ లేదు
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనంతరం వెంటనే అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో నటించనున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడు. ఇక మరొక కీలకమైన మిలిటరీ ఆఫీసర్ పాత్రలో ఎవరు నటిస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎన్ని రూమర్స్ వస్తున్నా చిత్ర యూనిట్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.
హీరోల పేర్లు వినిపిస్తున్నాయి..కానీ..
ఈ ప్రాజెక్టు ఎనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో నటించే మరో హీరో ఏవరు అనే సందేహం ఆడియెన్స్ లో అంచనాల డోస్ ని పెంచుతోంది. అందుకే చిత్ర యూనిట్ చాలా ఆలోచిస్తోంది. నితిన్, సాయి ధరమ్ తేజ్, రానా దగ్గుబాటి.. ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ ఫైనల్ కాలేదు.
లిస్టులోకి గోపీచంద్ కూడా..
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా చర్చలు జరుగుతున్నాయి కానీ ఇంకా ఫిక్స్ కాలేదని చెప్పాడు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే పవన్ కళ్యాణ్ తో గోపిచంద్ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉందని మరొక కొత్త టాక్ వస్తోంది. గోపిచంద్ హీరోగా సెట్టయిన తరువాత వేరే హీరోలతో సినిమా చేసింది లేదు. విలన్ ఆఫర్స్ వచ్చినా కూడా చేయలేదు. కానీ అయ్యప్పనుమ్ కొశీయుమ్ లో అది పూర్తిగా విలన్ పాత్ర కాకపోవడంతో ఒప్పుకునే అవకాశం లేకపోలేదు.
Recommended Video
పవన్ తో అంటే.. ఏదైనా జరగవచ్చు
కానీ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడం అంటే ఏదైనా జరగవచ్చు. మొదట దర్శకుడు పవన్ పై కాస్త ఫోకస్ చేయాల్సిందే. అయితే పవన్ తో సరి సమానంగా గోపిచంద్ క్యారెక్టర్ ని బ్యాలెన్స్ చేయగలిగితే అతని కెరీర్ కి ఈ సినిమా తప్పకుండా ఉపయోగపడుతుంది. పవర్ స్టార్ అభిమానులు గోపిచంద్ కి కూడా వీరాభిమానులవ్వడం కాయం. ఏదేమైనా గోపీచంద్ తో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను అద్భుతంగా డిజైన్ చేయవచ్చు. మరి అతన్ని ఈ సినిమాలో తీసుకుంటారో లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.