రాజమౌళి మల్టీస్టారర్: ఎన్టీఆర్-రాంచరణ్‌లతో పాటు మరో హీరో?..

Recommended Video

రాజమౌళి మల్టీస్టారర్ ఎన్టీఆర్-రాంచరణ్‌లతో పాటు మరో హీరో ?

బాహుబలి తర్వాత రాజమౌళి తదుపరి చిత్రమేంటి? అన్న దానిపై సినీ ఇండస్ట్రీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాంచరణ్-జూ.ఎన్టీఆర్ లతో ఆయన ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారన్న ప్రచారం జరుగుతున్నా.. దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు. ప్రాజెక్ట్ గురించే క్లారిటీ లేదంటే.. అప్పుడే ఈ సినిమా కథ గురించి కూడా ఊహాగానాలు మొదలైపోవడం గమనార్హం.

 కథ తయారుచేస్తున్న విజయేంద్ర ప్రసాద్..:

కథ తయారుచేస్తున్న విజయేంద్ర ప్రసాద్..:

బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమా తర్వాత తెరకెక్కింబోయే సినిమా కావడంతో రాజమౌళి ఎలాంటి కథను ఎంచుకోబోతున్నారన్న దానిపై అందరి చూపు నిలిచింది. బాహుబలితో వచ్చిన ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని.. అన్ని వర్గాలకు నచ్చే కథను తయారుచేయమని ఇప్పటికే ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌ను పురమాయించారు. ప్రస్తుతం ఆయన అదే పనిలో నిమగ్నమయ్యారట.

ముందు క్యారెక్టరైజేషన్స్.. ఆ తర్వాతే!:

ముందు క్యారెక్టరైజేషన్స్.. ఆ తర్వాతే!:

కథ తయారుచేసే విషయంలో విజయేంద్ర ప్రసాద్ శైలి భిన్నమనే చెప్పాలి. అందరూ ఒక ప్లాట్ లేదా లైన్ తీసుకుని కథను డెవలప్ చేసుకుంటూ పోతారు. కానీ విజయేంద్ర ప్రసాద్ మాత్రం ముందుగా కొన్ని బలమైన క్యారెక్టరైజేషన్స్ రాసుకుని.. దానికి అనుగుణంగా కథను ఆ పాత్రల చుట్టూ తిప్పుతారు.

 ప్రతినాయకుడి పాత్ర కూడా కీలకమేనట..:

ప్రతినాయకుడి పాత్ర కూడా కీలకమేనట..:

రాంచరణ్-జూ.ఎన్టీఆర్ లతో సినిమా కోసం బలమైన క్యారెక్టరైజేషన్స్ క్రియేట్ చేసే పనిలో పడ్డారట విజయేంద్ర ప్రసాద్. ఇప్పటికే రాంచరణ్, ఎన్టీఆర్ ల పాత్ర ఎలా ఉండాలనే దానిపై ఒక అంచనాకు వచ్చారట. ఇక వీరిద్దరికి సరిసమానంగా ప్రతినాయకుడి పాత్రను తీర్చిదిద్దబోతున్నారట.

 హీరోలకు సరిసమానమైన విలన్ పాత్ర:

హీరోలకు సరిసమానమైన విలన్ పాత్ర:

రాంచరణ్-జూ.ఎన్టీఆర్‌ల ఇమేజ్‌కు సరిపోయే విధంగా.. పేరున్న హీరోతోనే ప్రతినాయకుడి పాత్రను చేయించాలని రాజమౌళి ఆలోచిస్తున్నారట. విజయేంద్రప్రసాద్ ఆ పాత్రను అంత బలంగా తీర్చిదిద్దుతుండటంతో.. రానా లాంటి విలన్ పాత్రదారి కోసం వెతుకుతున్నారట.

 ముగ్గురు హీరోలా?:

ముగ్గురు హీరోలా?:

విజయేంద్ర ప్రసాద్ తీర్చిదిద్దిన క్యారెక్టరైజేషన్స్ ఇప్పటికే రాజమౌళికి విపరీతంగా నచ్చాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, పేరున్న హీరోను గనుక ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం ఎంచుకుంటే.. రాంచరణ్, ఎన్టీఆర్ లతో కలిపి మొత్తం ముగ్గురు హీరోలను తెరపై చూస్తామన్న మాట.

 బాక్సింగ్ నేపథ్యంలో:

బాక్సింగ్ నేపథ్యంలో:

రాంచరణ్-ఎన్టీఆర్‌లతో రాజమౌళి తెరకెక్కించబోయే సినిమా బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుందన్న ప్రచారం కూడా ఉంది. సినిమాలో ఇద్దరు అన్నదమ్ములుగా కనిపించబోతున్నారని, వీరిద్దరి మధ్య భావోద్వేగాలను తెరపై అద్భుతంగా చూపించబోతున్నారని అంటున్నారు. అయితే రాజమౌళి అధికారికంగా రివీల్ చేస్తే తప్ప ఇలాంటి విషయాలపై ఇప్పుడే ఓ అంచనాకు రావడం కష్టం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X