For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పుష్ప రాజ్ లో బ్యాడ్ క్యారెక్టర్.. అదే అసలైన థ్రిల్!

    |

    సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదటి సారి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా ఇదే. మొదట 170కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ఆ తరువాత లెక్కలు రెండు వందల కోట్లు దాటాయి.

    ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే.. సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం లీక్ అయినట్లు తెలుస్తోంది. సినిమా మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక గంధపు చెట్ల స్మగ్లింగ్ గ్యాంగ్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. అందులో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా కనిపించనున్నాడు. గ్యాంగ్ లో పుష్ప రాజ్ పాత్ర చాలా నెగిటివ్ గా ఉంటుందని టాక్ వస్తోంది.

    Another interesting news on pushpa raj character

    పుష్ప రెండు భాగాలుగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇక పార్ట్ 1 ఫస్ట్ హాఫ్ లో పుష్ప రాజ్ పాత్ర చాలా నెగిటివ్ గా ఉంటుందట. మరి ఈ మ్యాటర్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. అలాగే రష్మిక మందన్న పాత్ర చాలా అల్లరిగా ఉంటుందట. ఇక సెకండ్ హాఫ్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కు కొదవ ఉండదని సమాచారం. బన్నీ ముసుగులోనే విలన్స్ ను చితకొట్టే ఫైట్ సీన్ కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందట. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

    English summary
    Now all eyes are on the pushpa movie. Pan India Cinema is therefore planning to create good hype with music in all languages. Bunny gave a special gift to the goddess who had already prepared the creepy tunes for the flower,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X