ఇండియన్ 2 సినిమాకు మరో సమస్య.. తప్పకున్న టాప్ టెక్నీషియన్!
బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన సంచలన దర్శకుడు శంకర్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆయన సినిమాలో కేవలం కమర్షియల్ అంశాలే కాకుండా సమాజానికి ఉపయోగపడే మంచి సందేశాలు ఎన్నో ఉంటాయి. గతంలో ఎన్నో డిఫరెంట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల క్రియేట్ చేసిన శంకర్ రోబో అనంతరం మళ్ళీ తన స్థాయికి తగ్గట్టుగా విజయాలను అందుకోలేదు. ఐ, 2.ఓ సినిమాలు అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయాయి.
ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇండియన్ 2 సినిమాతో అయినా సక్సెస్ కొట్టాలని అనుకున్న శంకర్ కు కెరీర్ లో మొదటిసారి భారీ దెబ్బ పడింది. ఆ సినిమాను ఏ ముహూర్తన మొదలు పెట్టారో గాని గాని మొదటి నుంచి కూడా అనేక రకాల అడ్డంకులు వస్తున్నాయి. షూటింగ్ లో జరిగిన ప్రమాదమే భారీగా దెబ్బ కొట్టింది. యూనిట్ సభ్యులు కొందరు ప్రాణలు కోల్పోవడమే కోలుకోలేని దెబ్బ. ఇక ఆ తరువాత కరోనా వేటుకు మరికొన్నాళ్లు అగాల్సి వచ్చింది. కమల్ హాసన్ కమిట్మెంట్స్ వల్ల మరికొన్నాళ్లు, నిర్మాతకు, దర్శకుడికి మధ్య బడ్జెట్ విబేధాలు వలన మరికొన్నాళ్లు సినిమా లేటవుతూ వచ్చింది.

అందరూ షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్న సమయంలో ఇండియన్ 2 షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయాలని అనుకున్నాడు శంకర్.కానీ ఇప్పుడు మరో సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. కెమెరామెన్ రత్నవేలు ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. రోబో సినిమాతో తన స్థాయిని పెంచుకునే అవకాశం ఇచ్చిన శంకర్ కోసమే రత్నవేలు ఇండియన్ 2 కోసం లేటవుతున్నా వేయిట్ చేశాడు.
బయట ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా ఇండియన్ 2కోసం వాటిని వదులుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఇండియన్ 2 మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఆయన తప్పుకున్నట్లు సమాచారం. మరి ఇప్పుడు శంకర్ ఏ సినిమాటోగ్రఫర్ ను సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











