Pushpa నుంచి మరో మ్యాటర్ లీక్.. అల్లు అర్జున్ తో రష్మిక పాత్ర ఎలా ఉంటుందంటే?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అన్ని రకాల టాలెంట్స్ ను చాలా స్టైలీష్ గా ప్రజెంట్ చేస్తాడు. యాక్టింగ్ కామెడీ డ్యాన్స్ యాక్షన్ స్టైల్ ఇలా అన్ని రకాల కోణాల్లో బన్నీ తీసుకునే జాగ్రత్తలు అంతా ఇంతా కాదు. ఒక విధంగా లేటెస్ట్ జనరేషన్ కు తగ్గట్టుగా ట్రెండ్ సెట్ చేయాలంటే అల్లు అర్జున్ తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు. ఒక విధంగా స్టైలిష్ స్టార్ ఒక స్టైలిష్ డిజైనర్ కంటే కంటే కూడా కొన్ని సార్లు చాలా ఎక్కువగా ఆలోచిస్తాడు. చాలామంది స్టైలిస్ట్ లు కూడా ఆ విషయాన్ని ఓపెన్ గానే చెప్పారు. ఇక పుష్ప సినిమాలో మాత్రం అల్లు అర్జున్ మొదటిసారి రఫ్ లుక్ తో కనిపిస్తున్నాడు. దీంతో అభిమానులను ఏ విధంగా సంతృప్తి పరుస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

గతంలో ఆర్య ఆర్య-2 వంటి సినిమాలతో అల్లు అర్జున్ ని కొత్త తరహాలో చూపించిన డైరెక్టర్ సుకుమార్ ఈసారి మాత్రం ఊర మాస్ హై వోల్టేజ్ లుక్ తో మాత్రమే ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బెస్ట్ కాంబినేషన్ గా గుర్తింపు పోబడిన సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ ను టచ్ చేస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ మలయాళం భాషల్లో అన్ని రకాల ప్రమోషన్స్ చేయబోతున్నారు. మొదటి సాంగ్ తోనే భారీ హైప్ క్రియేట్ చేయడానికి ఐదు రకాల సింగర్స్ ను రంగంలోకి దింపారు. ఒక్కో భాషలో ఒక్కో పేరుతో స్థానిక జనాలకు అర్థం అయ్యేటట్టు గా ఆ పాటను ఈ నెల 13న విడుదల చేయబోతున్నారు. ఇక సినిమా హీరోయిన్ గా నటిస్తున్న రష్మీక మందన్న పాత్ర కూడా చాలా విభిన్నంగా ఉంటుందట.

Another key information leaked from pushpa story line

ఇంతవరకు ఎన్నో రకాల గ్లామరస్ పాత్రల్లో మెప్పించిన రష్మిక ఈసారి పుష్ప రాజ్ తో కలిసి తన టాలెంట్ ను మొత్తం బయటకు తీయనుందట. పల్లెటూరి అల్లరి అమ్మాయిలగా చాలా డిఫరెంట్ కనిపించనుందట. ఆమె అల్లు అర్జున్ కు భార్య పాత్రలోనే కనిపిస్తారని సమాచారం. సినిమాలో ఎక్కువ భాగం భార్య భర్తలుగా సందడి చేస్తారట. వారి మధ్య సన్నివేశాలు కూడా లో క్లాస్ కు తగ్గట్టుగా ఉంటాయని పల్లెటూరు వాతావరణం కూడా కరెక్ట్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. రష్మీక అయితే గట్టి నమ్మకంతో ఉన్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

సినిమా కోసం ప్రతి ఒక్కరు చాలా కష్టపడుతున్నారని కష్టానికి తగ్గ ఫలితం కూడా దక్కుతుంది అని వివరించారు. ఎవరు ఊహించని విధంగా సుకుమార్ లాంటి తెలివైన దర్శకుడు పూర్తి స్థాయిలో యాక్షన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో అర్థమవుతుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. పుష్ప సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్న విషయం విషయం తెలిసిందే. ఇక మొదటి భాగాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో ఐదు భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. ఇక రెండో భాగాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని అనుకున్నారు. పార్ట్ 2 సినిమా షూటింగ్ కూడా దాదాపు 80% అయితే పూర్తి అయింది. ఇక మధ్యలో అల్లు అర్జున్ ఐకాన్ సినిమాను పూర్తి చేసి పుష్ప 2పై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X