Don't Miss!
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పుష్పకు తప్పని లీక్స్ కష్టాలు.. మరో వీడియో వైరల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా పుష్పపై రోజురోజుకు అంచనాలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే న్యూ పోస్టర్స్ కొన్ని అలాగే లొకేషన్స్ ఫొటోస్ అభిమానులు అమితంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇలాంటి పెద్ద సినిమా కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా లీకుల బాధ తప్పడం లేదు. మరోసారి పుష్ప షూటింగ్ సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కీలకమైన షెడ్యూల్స్ పూర్తి..
బన్నీ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో అటు బాలీవుడ్ ఆడియెన్స్ లో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. నెవర్ బిఫోర్ అనేలా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఇటీవల నవంబర్ లో మొదలైన రెండు కీలకమైన షెడ్యూల్స్ ను రంపచోడవరం, మారేడు మిల్లి ప్రాంతాల్లో ఇటీవల ఫినిష్ చేశారు.
రెస్ట్ తీసుకోకుండా కష్టపడుతున్న బన్నీ
ఇక సినిమాలో పుష్ప రాజ్ పాత్ర కోసం బన్నీ గంటల తరబడి రెడీ అవ్వాల్సి వస్తోందట. మేకప్ కోసమే మూడు గంటల సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. మేకప్ వేసే క్రమంలో కదలకుండా అలానే గంటల తరబడి ఉండడం అంత సామాన్యమైన విషయం కాదు. కానీ బన్నీ మాత్రం సుకుమార్ విజన్ కు తగ్గట్లుగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
అలా మొదలైన లీక్స్..
అయితే చిత్ర యూనిట్ గంటల తరబడి కష్టపడుతుంటే కొంతమంది సినిమా షూటింగ్ కు సంబంధించిన లొకేషన్స్ సీన్స్ ను మొబైల్ తో షూట్ చేసి సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నారు. కొన్ని వారాల క్రితం బన్నీ ఇంట్రడక్షన్ సాంగ్ మేకింగ్ కు సంబంధించిన వీడియో ఒకటి లీకైన విషయం తెలిసిందే. సాంగ్ బావుందని కామెంట్స్ అయితే బాగానే వచ్చాయి.
వైరల్ గా మారిన మరో లీక్ వీడియో
ఇక ఇప్పుడు మరో సాంగ్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా మరొకసారి లీక్ అయ్యింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంపై చిత్ర నిర్మాతలు సీరియస్ అయినట్లు సమాచారం. లీక్ చేసిన వారిపై చర్యాలు తీసుకోవడమే కాకుండా ఇక నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ షూటింగ్ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.