టాలీవుడ్‌లో మరో ‘మనం’.. ప్లాన్ చేస్తున్న ప్రముఖ సినీ కుటుంబం

Recommended Video

Mahesh Babu, Krishna And Gautham Ghattamaneni To Come Together For A Movie?

2014లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం 'మనం'. అక్కినేని కుటుంబం మొత్తం చిరస్థాయిగా గుర్తుంచుకునే సినిమా ఇది. ఏఎన్నార్ నటించిన చివరి చిత్రం కూడా ఇదే. బాలీవుడ్‌లో రాజ్‌క‌పూర్ కుటుంబం త‌ర్వాత మూడు త‌రాల న‌టులు క‌లిసి న‌టించిన క్రెడిట్ మ‌న టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీకే ద‌క్కుతుంది. అలాగే, తెలుగు సినీ ఇండస్ట్రీలోనే క్లాసికల్ హిట్‌గా నిలిచింది. దీంతో ఏ కుటుంబానికీ దక్కని అరుదైన ఘనతను అక్కినేని ఫ్యామిలీ సొంతం చేసుకుంది. తాజాగా ఇదే తరహాలో సినిమా చేయడానికి మరో కుటుంబం ప్రయత్నం చేస్తుంది.

మనం గురించి

మనం గురించి

పునర్జన్మల నేపథ్యంలో 2014లో వచ్చిన చిత్రం మనం. అక్కినేని ఫ్యామిలి మొత్తం కలసి ఓ చిత్రంలో నటించాలని నాగార్జున భావిస్తున్న తరుణంలో దర్శకుడు విక్రం కుమార్ మనం చిత్ర కథని వినిపించారు. ఇందులో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, నాగార్జున‌, నాగ‌చైత‌న్య, సమంత, శ్రియ నటించారు. అలాగే అమల, అఖిల్ అతిథి పాత్రల్లో నటించారు. ఈ సినిమాను నాగార్జునే స్వయంగా నిర్మించాడు.

ఎన్నో ఫ్యామిలీలు ప్లాన్ చేస్తున్నాయంటూ

ఎన్నో ఫ్యామిలీలు ప్లాన్ చేస్తున్నాయంటూ

మనం వచ్చిన తర్వాత అదే తరహా సినిమా చేయడానికి చాలా ఫ్యామిలీలు సన్నాహాలు చేస్తున్నాయని ప్రచారం జరిగింది. ఇందులో భాగంగానే నందమూరి కుటుంబం సినిమా చేస్తుందని అన్నారు. అలాగే, మెగా ఫ్యామిలీ కూడా ఇలాంటి మూవీనే చేస్తుందని ప్రచారం జరిగింది. కానీ, అవేవీ కార్య రూపం దాల్చలేదు. ఇక, తాజాగా మరో సినిమా వస్తుందని వార్తలు వస్తున్నాయి.

ప్లానింగ్‌లో మరో మనం

ప్లానింగ్‌లో మరో మనం

‘మనం' నుంచి ప్రేరణ పొందారో ఏమో గానీ టాలీవుడ్‌లో అలాంటి సినిమానే మరోకటి రాబోతుందని తెలుస్తోంది. అది ప్లాన్ చేసేది ఎవరో కాదు. గట్టమనేని కుటుంబం. అవును.. మహేశ్ బాబు కుటుంబం కలయికలో ఓ సినిమా రాబోతుందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అంతేకాదు, ఈ సినిమాను ‘మహర్షి' దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం.

వీళ్ల ముగ్గురితో పాటు అతడు కూడా

వీళ్ల ముగ్గురితో పాటు అతడు కూడా

వంశీ పైడిపల్లి తెరకెక్కించబోయే ఈ సినిమాలో సూప‌ర్ స్టార్ కృష్ణ‌, మ‌హేశ్‌, గౌత‌మ్‌లు క‌లిసి న‌టిస్తార‌ని ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు కృష్ణ అల్లుడు, మహేశ్ బావ సుధీర్ బాబు కూడా ఓ కీలక పాత్ర చేస్తాడని అంటున్నారు. అలాగే, సీనియర్ నరేష్, మంజుల కూడా ఇందులో కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్.

సరిలేరు అంటూ వస్తున్నాడు

సరిలేరు అంటూ వస్తున్నాడు

తాజాగా మహేశ్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేశ్ ఆర్మీ మేజర్‌గా నటిస్తున్నాడు. అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా, ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X