బాలయ్య దర్శకుడితో మహేష్ ప్రాజెక్ట్.. అది హిట్టయితేనే బిగ్ బడ్జెట్ మూవీ?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో మొత్తానికి బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అయితే అందుకున్నాడు కానీ పూర్తిస్థాయిలో మాత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేయలేకపోయాడు. సర్కారు వారి పాట సినిమాకు కొన్ని ఏరియాల్లో నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాను స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే.
ఆ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ జూన్ చివరలో లేదా జూలై మొదటి వారంలో మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో మొదటి సారి మహేష్ బాబు ఫ్యాన్ ఇండియా సినిమా కూడా చేయబోతున్నాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కథ అయితే ఇంకా ఫైనల్ కాలేదు అని తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే మహేష్ బాబు, రాజమౌళి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఆ ప్రాజెక్ట్ కోసం దాదాపు రెండేళ్ల సమయం పట్టవచ్చు అని తెలుస్తోంది.

మహేష్ బాబు భవిష్యత్తు ప్రాజెక్టుల కోసం కొంత మంది దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నట్లు టాక్. రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ మహేష్ బాబుతో మరో సినిమా చేసేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడట. అయితే దర్శకుడు ఎవరు అనే విషయం లో కూడా ఒక టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తో ఒక మాస్ కమర్షియల్ సినిమాను తెరపైకి తీసుకు వస్తున్న గోపీచంద్ మలినేని మహేష్ బాబు సినిమా కోసం డైరెక్టర్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
క్రాక్ సినిమాతో బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న గోపీచంద్ మలినేని ఇప్పుడు బాలయ్యతో కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా కూడా సక్సెస్ అయితే మాత్రం తప్పకుండా మహేష్ తో సినిమా చేసే అవకాశం ఇస్తామని కూడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఒక ఆఫర్ ఇచ్చినట్లు టాక్ వస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











