Bhola Shankar: చిరు 'భోళాశంకర్'లో మరో మెగా హీరో.. మీరు గమనించారా?
ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన భోళా శంకర్ సినిమా మిక్స్డ్ టాక్ అందుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా రెండు రోజుల వసూళ్లు సైతం దారుణంగా నమోదయ్యాయని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంచితే భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కాకుండా మరో మెగా హీరో కూడా కనిపించాడని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ మెగా హీరో ఎవరు? ఏమిటి? అనే వ లోపలికి వెళ్లి తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భోళా శంకర్ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. కేవలం కామన్ ఆడియన్స్ మాత్రమే కాదు.. మెగా అభిమానులు సైతం సినిమాని ఏమాత్రం మెచ్చుకోలేకపోతున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్నా భాటియా నటించింది. చిరంజీవి చెల్లెలి పాత్రలో మాత్రం కీర్తి సురేష్ నటించింది. సుశాంత్ కూడా ఒక కీలకపాత్రలో నటించిన ఈ సినిమాలో.. జబర్దస్త్ నటినటులు మాత్రమే కాదు రష్మీ, శ్రీముఖి వంటి వారు కూడా కనిపించారు.

మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కాకుండా మరొక మెగా హీరో కనిపించినట్లుగా సినిమా చూసిన వాళ్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎవరా మెగా హీరో అని బుర్రలు బద్దలు కొట్టుకోకండి. ఆ మెగా హీరో ఇంకా ఎవరో కాదు కొణిదెల పవన్ తేజ్.. హీరో అంటున్నారు ఏంటి అని మీకు అనుమానం కలగవచ్చు. ఈయన కూడా ఒక మెగా హీరోనే.. మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్, నాగబాబు సోదరులకు కుమారుడు వరసయ్యే ఈయన తెలుగులో ఈ పాత్రను కల్పితం అనే సినిమాలో హీరోగా నటించాడు.
ఈటీవీలో కొన్నాళ్లు యాంకర్ గా కొనసాగిన మేఘన అనే అమ్మాయి కల్పితం సినిమాలో హీరోయిన్ గా నటించింది. అసలు ఈ సినిమా విడుదల అయింది అనే సంగతి కానీ ఇలాంటి ఒక సినిమా ఉందా అనే సంగతి కానీ చాలామందికి తెలియదు. అయితే ఈ సినిమాలో నటించినందుకు గాను వీరిద్దరూ ప్రేమలో పడి ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు.

హీరోగా చేసిన సినిమా దారుణంగా ఫెయిల్ కావడంతో మనవాడికి పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు. దీంతో మెగాస్టార్ తో సినిమాలు చేస్తున్న దర్శకుల కంటపడి ఏవో చిన్నాచితకగా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఆచార్య సినిమాతో మొదలుపెడితే గాడ్ ఫాదర్, ఇటీవల భోళా శంకర్ సినిమాలో కూడా నటించాడు. అయితే ఈ మూడు సినిమాల్లో ఆయనకు ప్రాధాన్యత లేని మాత్రమే దక్కాయి.
అయితేనే సినిమాలో అతిధి పాత్రలు చేస్తూ మెగా హీరో బాగానే ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతేకాదు.. మరి ఈ మూడు సినిమాలు మీరు కూడా చూసినట్లయితే పవన్ తేజ్ ను మీరు కూడా గుర్తించారా గుర్తిస్తే కనుక కింద కామెంట్ చేయండి.


Click it and Unblock the Notifications











