twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో మెగా హీరో.. ఊహించని క్యారెక్టర్?

    |

    జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరొక పాన్ ఇండియా సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో తెరపైకి రాబోతున్న ఈ సినిమా కోసం దర్శకుడు కొరటాల క్యాస్టింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ఈ సినిమాలో కొంతమంది బాలీవుడ్ ప్రముఖ నటీనటులు కూడా కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం హీరోయిన్ విషయంలో అయితే ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు.

    అయితే సినిమాలో మరొక ముఖ్యమైన పాత్ర కోసం ఒక ప్రముఖ హీరోని సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక అతను ఎవరో కాదు మెగా హీరో అని తెలుస్తోంది. ఇదివరకే RRR సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటించిన ఎన్టీఆర్ కు మంచి స్నేహం ఏర్పడింది. ఇక అంతకంటే ముందే మరి కొంతమంది మెగా హీరోలతో ఎన్టీఆర్ కు మంచి అనుబంధమో ఉంది. ఇక అందులో సాయిధరమ్ తేజ్ కూడా ఎన్టీఆర్ ను ఎంతగానో ఇష్టపడతాడు. అయితే ఈసారి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కపోయే సినిమాలో సాయిధరమ్ తేజ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

    Another mega hero special role in Jr ntr 30 project

    అందులో ఎన్టీఆర్ కు అతను బావమరిది పాత్రలో కనిపిస్తాడు అని సమాచారం. ఆ పాత్ర పవర్ఫుల్ గా ఉండడమే కాకుండా చాలా ఎమోషనల్ గా కూడా ఉంటుందట. ఇక ఇదివరకే దర్శకుడు కొరటాల శివ కొంతమంది హీరోలను అనుకున్నాడు. కానీ ఫైనల్ గా సాయిధరమ్ తేజ్ పై అందరూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చి అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారట. ఇక రెగ్యులర్ సినిమా షూటింగ్ అయితే వచ్చే నెలలో మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. వీలైనంత త్వరగా ఇదే ఏడాదిలో షూటింగ్ మొత్తాన్ని పూర్తిచేసి వచ్చే ఎడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురావాలని అనుకుంటున్నారు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ సోలోగా ఫ్యాన్ ఇండియా వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

    English summary
    Another mega hero special role in Jr ntr 30 project
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X