మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో.. ఆలస్యమైనా వాళ్ల ఒత్తిడి మేరకు ఇలా.!

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ మధ్యనే సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమాను ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో మరో హీరో టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడని ఓ వార్త బయటకు వచ్చింది. దీంతో మెగా అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ అలియాస్ వెంకటేష్ త్వరలోనే నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఓ వార్త ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇన్ని రోజులు సినీ రంగానికి దూరంగా ఉంటూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిన బాబీ.. సినీ రంగం వైపు రావాలని అనుకుంటున్నాడని తెలుస్తోంది. అతడి సన్నిహితులు, బంధువులు ఈ విషయంలో అతడిని ఒత్తిడి చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనికి బాబీ కూడా సుముఖంగానే ఉన్నట్లు సమాచారం.

Another Mega Hero will entry to Tollywood

ఇటీవలే బాబీ వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజుల్లో గీతా ఆర్ట్స్ వ్యవహారాలు చూసుకోవాలని అల్లు అరవింద్ ఇప్పటికే చెప్పేశారట. ఈ నేపథ్యంలో ముందు నటుడిగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత నిర్మాతగా మారాలని ఆయన భావిస్తున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి అల్లు అరవింద్ కుమారుల్లో ఇద్దరు అల్లు అర్జున్, శిరీష్ ఇప్పటికే సినీ రంగ ప్రవేశం చేశారు. వీరిలో బన్నీ స్టార్ హీరోగా వెలుగొందుతుండగా, శిరీష్ మాత్రం తన ప్రయత్నాలను తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు బాబీ ఎంట్రీ ఇస్తాడని వార్తలు వస్తున్నాయి.

వివాహం అయిన తర్వాత బాబీ.. లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు. తరచూ వ్యాయామాలు చేయడం.. లుక్ పరంగా సరికొత్త స్టైల్స్ ఫాలో అవడం వంటివి చేస్తున్నాడని తెలిసింది. అలాగే, నటన, డ్యాన్స్, ఫైట్స్‌లో శిక్షణ తీసుకోబోతున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ వార్తను తమ సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేసుకుని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X