రాజమౌళి తదుపరి సినిమా కూడా మల్టీస్టారరే.. మహేశ్‌తో పాటు ఆ ఇద్దరు హీరోలు!

By Manoj

కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. భారీ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఆయన ప్రస్తుతం RRR అనే సినిమా చేస్తున్నాడు. ఎన్నో ఆటంకాల నడుమ ఈ సినిమా విడుదల తరచూ వాయిదా పడుతోంది. ఇది పట్టాలపై ఉండగానే.. తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా రాబోయే ఈ ప్రాజెక్టు గురించి తాజాగా ఓ సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్

టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్


‘బాహుబలి' వంటి సూపర్ డూపర్ హిట్ సిరీస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. 19వ శతాబ్దం ప్రారంభంలో జరిగిన కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటులు కీలక పాత్రలు చేస్తున్నారు.

మహేశ్ బాబుతో సినిమా.. జక్కన్న ప్రకటన

మహేశ్ బాబుతో సినిమా.. జక్కన్న ప్రకటన


RRR మూవీ షూటింగ్ జరుపుకుంటున్న సమయంలోనే రాజమౌళి మరో క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన చేశారు. లాక్‌డౌన్ కారణంగా ఖాళీగా ఉంటున్న ఆయన ఇటీవల ఓ న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సమయంలో RRR తర్వాత మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తారని కూడా తెలిపాడు.

ఎవరికి తోచింది వాళ్లు.. క్రేజీ రూమర్స్

ఎవరికి తోచింది వాళ్లు.. క్రేజీ రూమర్స్

మహేశ్ బాబుతో సినిమా గురించి రాజమౌళి ప్రకటించాడో లేదో... క్రేజీ ప్రాజెక్టుపై ఎన్నో రూమర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ సినిమా కథ ఇదే అని... దీనికి ఇంత బడ్జెట్ కేటాయించారని.. ఇందులో పలానా వాళ్లు నటిస్తున్నారని.. ఈ మూవీ ఆ జోనర్‌లో వస్తుందని.. ఇలా బోలెడు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టు నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.

మహేశ్ ప్రకటించేది ఆ ప్రత్యేకమైన రోజునే

మహేశ్ ప్రకటించేది ఆ ప్రత్యేకమైన రోజునే

ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు గురించి రాజమౌళి ప్రకటించాడు కానీ... మహేశ్ బాబు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే, ఇటీవల ప్రచారం అవుతోన్న సమాచారం ప్రకారం.. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను మహేశ్ చేయబోతున్నాడట. మరోవైపు, ఈ మూవీ కథను ఇప్పటికే ప్రారంభించాడట జక్కన్న తండ్రి విజయేంద్రప్రసాద్.

రాజమౌళి తర్వాతి సినిమా కూడా మల్టీస్టారరే

రాజమౌళి తర్వాతి సినిమా కూడా మల్టీస్టారరే

అధికారిక ప్రకటన వెలువడకముందే ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా దీని గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం... ఈ సినిమాను కూడా మల్టీస్టారర్‌గానే తెరకెక్కించబోతున్నాడట రాజమౌళి. అందుకు అనుగుణంగానే విజయేంద్రప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నాడని ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.

Recommended Video

Mahesh Babu, Ram Charan To Team Up With New Project After RRR | Filmibeat Telugu
క్రేజీ మూవీలో మహేశ్‌తో పాటు ఇద్దరు హీరోలు.!

క్రేజీ మూవీలో మహేశ్‌తో పాటు ఇద్దరు హీరోలు.!

మల్టీస్టారర్ మూవీ అనగానే మహేశ్ బాబుతో కలిసి నటించే హీరోలు ఎవరన్న దానిపై అందరిలోనూ ఆసక్తి కనిపిస్తోంది. వైరల్ అవుతోన్న వివరాల ఆధారంగా.. ఇందులో మరో ఇద్దరు హీరోలు నటిస్తారట. వారిలో ఒకరు మన ఇండస్ట్రీకి చెందిన హీరో కాగా, మరొకరు బాలీవుడ్‌కు చెందిన హీరో అని సమాచారం. ఇదే నిజమైతే టాలీవుడ్‌లో భారీ ప్రాజెక్టు అవడం ఖాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X