For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరో కొత్త డేట్ పై కూడా ఫోకస్ పెట్టిన బోయపాటి.. అందుకే అఖండ ఆలస్యంగానే..

  |

  నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా అఖండ సినిమా గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను ఈ పాటికే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కష్టకాలం ఈ సినిమాపై కూడా గట్టిగానే ప్రభావం చూపించింది. అయితే దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ మాత్రం ముందుగా తొందరపడకుండా షూటింగ్ ను మెల్లగానే పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. మళ్లీ సినిమా మొత్తం పూర్తి అయిన తర్వాత విడుదల తేదీపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందని వీలైనంత వరకు మెల్లగానే షూటింగ్ పనులను పూర్తి చేసుకుంటూ వచ్చారు.

  ఇక దాదాపు పనులన్నీ కూడా తుది దశకు చేరుకున్నాయి. అయితే ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ను కూడా స్టార్ట్ చేయాలని ఇటీవల దర్శకుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇక ఏ సినిమాకైనా కూడా మొదట టీజర్ ట్రైలర్ మంచి హైప్ క్రియేట్ చేస్తాయి. ఇక అంతకంటే ఎక్కువగా పాటలతోనే సినిమాను జనాల్లోకి ఎక్కువగా తీసుకువెళ్లి అవకాశం ఉంటుంది. ఒక్క పాట క్లిక్కయినా కూడా అంతకంటే పెద్ద ప్రమోషన్ అవసరం లేదు. ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్ పైనే ఆ ఒత్తిడి ఉంటుంది కాబట్టి సినిమాపై అంచనాలు పెరగాలి అంటే ఏదో ఒక పాట జనాల్లో నిత్యం వినిపిస్తూనే ఉండాలి.

  Another news on Balakriahna Akhanda movie release date

  ఈ సినిమాలో బాలకృష్ణ రెండు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు ముఖ్యంగా అఘోర పాత్ర పై అయితే అభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు పెంచుకొంటున్నారు. మరి సినిమా అభిమానులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమా విడుదల తేదీపై ఇదివరకే చిత్ర యూనిట్ కొన్ని చర్చలు జరిపింది. దసరా సమయంలో విడుదల చేయాలని అనుకుంటున్నారు కానీ పరిస్థితులు అప్పుడు తేడా కొడితే మళ్ళీ వాయిదా పడే అవకాశం కూడా ఉంటుందట. ముందుగా దసరాకు అయితే ఒక ప్లాన్ అయితే సెట్ చేసుకోవాలి అని దర్శక నిర్మాతలు చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ ఆ డేట్ సెట్టవ్వకపోతే నవంబర్ తుది వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో వచ్చే ఛాన్స్ ఉందట. ఏదైనా పరిస్థితులు అనుకూలిస్తేనే సినిమాని విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక బాలకృష్ణ అఖండ సినిమా అనంతరం గోపీచంద్ మలినేని తో మరొక యాక్షన్ సినిమాను మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే ఆ సినిమా రాయలసీమ అనంతపురం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కనుంది.

  Another news on Balakriahna Akhanda movie release date

  ఇక అఖండ మ్యూజిక్ విషయంలో కూడా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ అలాంటి జాగ్రత్తలు చాలానే తీసుకున్నాడట. బోయపాటి శ్రీనివాస్ యాక్షన్ సన్నివేశాలతో ఎలాగైతే మంచి వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తారో అలాగే కొన్ని పాటల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా నుంటాటూ. రోమాంటిక్ మెలోడీ పాటలు బాగానే క్లిక్కవుతాయి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా బోయపాటి టేస్ట్ కి తగ్గట్టుగానే పాటలను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఫస్ట్ సింగిల్ 'అడిగా అడిగా' అనే మెలోడీ పాటను ఈ నెల 18న సాయంత్రం 5:33కి విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ సినిమాలో కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

  English summary
  Another news on Balakriahna Akhanda movie release date
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X