twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ ఎంతో ఇష్టంతో సెట్ చేసిన ప్రాజెక్ట్.. క్యాన్సిల్ చేసిన అనుష్క..

    |

    బాహుబలి అనంతరం అనుష్క శెట్టి ఆలోచనా విధానం చాలా విబిన్నంగా ఉంటోంది. ఆఫర్స్ కుప్పలు కుప్పలుగా వస్తున్నా కూడా అమ్మడు ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇక చర్చల దశలో ఉన్న సినిమాలు కూడా క్యాన్సిల్ అవుతున్నట్లు టాక్ వస్తోంది. అనుష్కను వెండితెరపై చూసి చాలా కాలం అయ్యింది. గత ఏడాది థియేటర్స్ లో విడుదల కావాల్సిన నిశ్శబ్దం సినిమా లాక్ డౌన్ వలన ఓటీటీలో విడుదల అయ్యింది.

    అయితే ఆ సినిమా దారుణమైన టాక్ ను సొంతం చేసుకుంది. థియేటర్స్ లో విడుదలై ఉంటే బాక్సాఫీస్ వద్ద అనుష్క బిగ్గెస్ట్ డిజాస్టర్ ను ఎదుర్కునేదని కథనాలు చాలానే వచ్చాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే అనుష్క శెట్టి ఒక కథను రిజెక్ట్ చేసినట్లు టాక్ వస్తోంది. అది కూడా ప్రభాస్ ఎంతో ఇష్టంతో సెట్ చేసిన కథ అని కథనాలు వెలువడుతున్నాయి. అనుష్క - నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ లో ఒక డిఫరెంట్ లవ్ స్టోరీని సెట్స్ పైకి తీసుకు రావాలని అనుకున్నారు.

    Another shocking news on anushka shetty uv project

    రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ గత ఏడాది నుంచి ఆ కథను ఎన్నో రకాలుగా మార్చాడు. 15 ఏళ్ళ వ్యత్యాసం ఉన్న ఒక మహిళ తనకంటే చిన్నవాడైన యువకుడిని ఎలా ప్రేమిస్తుందనేది సినిమా అసలు కథ. అయితే కథ పాయింట్ కొత్తగా అనిపించినా కూడా అనుష్కకు స్క్రిప్ట్ మొత్తం అంతగా కనెక్ట్ అవ్వడం లేదట. యూవీ క్రియేషన్స్ లోనే సినిమాను నిర్మించాలని అనుకున్నారు. మొదట ఈ కథ వినగానే అనుష్క, నవీన్ కు పర్ఫెక్ట్ గా సెట్టవుతుందని సలహా ఇచ్చాడు. కానీ డార్లింగ్ అనుకున్నట్లుగా అనుష్క కథపై నమ్మకంగా లేకపోవడంతో యూవీ క్రియేషన్స్ ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేసినట్లు సమాచారం. మరి సినిమా మొత్తం క్యాన్సిల్ అయినట్లేనా లేదా మరెవరితో అయినా ట్రై చేస్తారో లేదో చూడాలి.

    English summary
    Anushka Shetty's film career has been going very smoothly since its inception. No matter how many rumors came this beauty did not care much about them. Cool went on doing his work himself. Most of the opportunities kept looking for her. Success has been spinning the wheel as a top heroine for the past few years regardless of failures. Now there are various articles on her next film. Talk is coming that it is a different love story
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X