twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్వేతాబసు మళ్లీ సీక్రెట్ పెళ్లి! భర్తకు విడాకులు ఇచ్చి మరో వ్యక్తితో

    |

    కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి సింపుల్ ఎంట్రీ ఇచ్చిన క్యూట్ బ్యూటీ శ్వేతా బసు ప్రసాద్. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ ఇండస్ట్రీలో సినీ ప్రముఖులను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. కెరీర్ మొదట్లో మంచి జోష్ తో కనిపించిన శ్వేతా ఆ తరువాత మెల్లమల్లగా డౌన్ అవుతూ వచ్చింది. కెరీర్ లో కొత్త బంగారు లోకం సినిమా తప్పితే ఆమెకు మరో సక్సెస్ రాలేదు.

    స్టార్ హీరోయిన్ అవ్వాలని...

    స్టార్ హీరోయిన్ అవ్వాలని...

    హీరోయిన్ గా సక్సెస్ అయ్యేందుకు శ్వేతా బసు ప్రసాద్ అప్పట్లో తీవ్రంగా ప్రయత్నం చేసింది. ఎంత కష్టపడినా అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. గ్లామర్ పాత్రలకైనా రెడీ అంటూ అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్స్ తో దర్శనమిచ్చేది. కానీ ఆమె హాట్ హీరోయిన్ పాత్రలకు సెట్టవ్వదనే కామేంట్స్ వచ్చాయి. దీంతో స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కలేదు..

     ఆర్థిక ఇబ్బందులు..

    ఆర్థిక ఇబ్బందులు..

    శ్వేత బసు హీరోయిన్ గా అడుగుపెట్టిన అనంతరం మొదట్లో కొన్ని విజయాలు ఆమెలో ఆశాల్ని రేపాయి. ఇష్టం ఉన్నట్లు కొన్ని చిన్న సినిమాలు చేయడంతో అప్పుడు డబ్బులు బాగానే వచ్చాయి. కానీ ఆ తరువాత అపజయాలు కారణంగా అవకాశాలు రావడం కూడా తగ్గాయి. దీంతో మెల్లగా శ్వేతా లైఫ్ లో ఆర్థిక ఇబ్బందులు కూడా మొదలయ్యాయి.

    ఆ తప్పు ఇంకా బాధపెడుతోంది..

    ఆ తప్పు ఇంకా బాధపెడుతోంది..

    శ్వేతా బసు ఆ మధ్య కొన్ని వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ బాధ నుంచి కోలుకోవడానికి అమ్మడు 2018లో రోహిత్ మిట్టల్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. అతనితో విడిపోవడం కాస్త డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. ఆ నిర్ణయం తీసుకొని తప్పు చేశానని తన సన్నిహితులతో చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Iddari Lokam Okate Pre Release Event | Raj Tarun | Shalini Pandey
    మరో పెళ్లి?

    మరో పెళ్లి?

    అప్పుడప్పుడు తన జీవితం గురించి శ్వేత బసు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులతో ఫాలోవర్స్ కి షాకిస్తోంది. ఇక ప్రస్తుతం డిప్రెషన్ లోకి వెళ్లడంతో ఇప్పటికైనా కుటుంబ సభ్యులకు నచ్చినట్లుగా నడుచుకొని మరో పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందట. లాక్ డౌన్ అనంతరం శ్వేత కుటుంబ సబ్యుల సమక్షంలోనే సీక్రెట్ గా వివాహం చేసుకునే ఛాన్స్ ఉందంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

    English summary
    Shweta Basu Prasad, a beauty queen who made a simple entry into the Tollywood industry with her kotha bangaru lokam movie. Her first film has attracted a lot of celebrities in the beauty industry. Shweta, who appeared to be good Josh early on in her career, then came down slowly. She had no other success in her career except for the kotha bangaru lokam movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X