ప్రభాస్ అభిమానులను కలవరపెడుతున్న మరో బ్యాడ్ రూమర్
రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ రాధేశ్యామ్ సినిమాతో ఎలాగైనా అభిమానులకు మంచి బాక్సాఫీస్ హిట్టివ్వాలని చూస్తున్నాడు. సాహో అనుకున్నంతగా హిట్టవ్వకపోవడంతో ఈ సారి వచ్చే సినిమా అంతకుమించి అనేలా ఉండాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమా షూటింగ్ యూరప్ లో కొనసాగుతోంది. ఒక స్వచ్ఛమైన ప్రేమ కథలా దర్శకుడు రాధాకృష్ణ సినిమాను చాలా రొమాంటిక్ గా తెరకెక్కిస్తున్నాడట.
హీరోయిన్ గా మొదటిసారి పూజా హెగ్డే ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే అభిమానులు కలలో కూడా ఊహించలేని ఒక రూమర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రాధేశ్యామ్ సినిమాలో ఒక్క ఫైట్ కూడా ఉండదట. కనీసం ప్రభాస్ చెంపదెబ్బ కూడా కొట్టడని కథనాలు వెలువడుతున్నాయి. ఇంతవరకు ప్రభాస్ అభిమానులు ఎన్నడు కూడా ఇలాంటి సినిమాను ఊహించలేదు. బాహుబలి లాంటి సినిమా చేసిన హీరోతో ఈ ప్రయోగం ఎలా చేస్తున్నారు అని అందరు షాక్ అవుతున్నారు.

లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కథలు ఎన్ని చేసినా కూడా దర్శకులు ఎక్కడో ఒక చోట అభిమానులను దృష్టిలో ఉంచుకొని యాక్షన్ సీక్వెన్స్ ని సెట్ చేసేవారు. కానీ ఈ సారి దర్శకుడు రాధాకృష్ణ మాత్రం రాధేశ్యామ్ లో ఒక్క యాక్షన్ సీన్ కూడా సెట్ చేయలేదని రూమర్స్ వస్తున్నాయి. ఈ విషయం హార్డ్ కోర్ అభిమానులను కాస్త కలవరపెడుతోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ని ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











