RRR బడ్జెట్ ఇంకా పెరగనుందా.. నిర్మాతపై మరో 100కోట్ల భారం?
సినిమా పుట్టుక మొదలయినప్పటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీకి పెద్దగా బ్రేక్ పడింది లేదు. గత చరిత్రలో ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నా కూడా సినిమా షూటింగ్స్ కొనసాగుతూనే ఉండేవి. కానీ 2020లో మాత్రం కంటికి కనిపించని కరోనా వైరస్ ఉహీంచని విధంగా సినిమా షూటింగ్స్ కి బ్రేక్ వేసింది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకు పెద్డ దెబ్బె పడింది.

గట్టిగానే ట్రై చేస్తున్నాడు..
టాలీవుడ్ లో నెవర్ బిఫోర్ అనేలా ప్రస్తుత జనరేషన్ అంచనాల డోస్ ఆకాశాన్ని దాటేలా చేస్తున్న చిత్రం RRR. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమా థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పట్లో ఆ సినిమా వచ్చే అవకాశమే కనిపించడం లేదు. షూటింగ్ స్టార్ట్ చేయాలని జక్కన్న తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.

బడ్జెట్ పెరగనుందా..?
రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలు నటిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 450కోట్ల వరకు ఉంటుందని నిర్మాత డివివి.దానయ్య ముందుగానే క్లారిటీ ఇచ్చాడు. ఇక సినిమా షూటింగ్ ఇంకా 30శాతం పూర్తి చేయాల్సి ఉంది. అయితే బడ్జెట్ ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ అదుపులోకి వస్తే వీలైనంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.

నవంబర్ లో స్టార్ట్ చేయాలని
మళ్ళీ షూటింగ్ ఫ్రెష్ గా స్టార్ట్ చేయడం అంటే చాల కష్టపడాల్సి ఉంటుంది. రాజమౌళి గ్యాంగ్ నవంబర్ లో షూటింగ్ పనులు మొదలుపెట్టాలని ఒక షెడ్యూల్ అయితే సెట్ చేసుకుంది. ఇక సినిమా షూటింగ్స్ ని వీలైనంత త్వరహా పూర్తి చేయాలనే క్రమంలో దర్శకుడు మళ్ళీ ఎక్కువగా ఖర్చు చేయిస్తున్నాడట.

పరిస్థితులను బట్టి చూస్తే..550కోట్లు?
ఇప్పటికే 450కోట్లు అనుకోగా ఇప్పుడు మరో 100కోట్లతో బడ్జెట్ 550కోట్లకు చేరే ఛాన్స్ ఉన్నట్లు టాక్. ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియదు గాని ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే సినిమా కోసం ముందే సిద్ధం చేసిన సెట్స్ ని కూడా మళ్లీ చెక్ చేసి సెట్ చేయాల్సి ఉంటుంది. పైగా నైట్ షూట్స్ కూడా పెట్టుకుంటున్నారట. అలాగైతే పేమెంట్స్ కూడా డబుల్ అవుతుంది. ఈ విధంగా RRR కాస్ట్ ఉహీంచని స్థాయికి చేరుకోనుంది.


Click it and Unblock the Notifications











