పవన్ సినిమాలో పాన్ ఇండియా హీరో.. ఎలాంటి పాత్ర చేస్తున్నాడో తెలిస్తే!
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోల్లో అతి తక్కువ మందికి మాత్రమే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి వారిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. దీంతో స్టార్‌డమ్‌ను అందుకుని దూసుకెళ్తోన్నాడు. ముఖ్యంగా రీఎంట్రీలో జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ మూడు నాలుగు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒకటి. 'గబ్బర్ సింగ్' వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ స్టార్ హీరో చేస్తున్న ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీస్తున్నారు.

'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చాలా రోజుల క్రితమే మొదలు పెట్టారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్నారు. అలాగే మిగిలిన షూట్‌ను కూడా పక్కా ప్లాన్‌తో చేసుకున్నారు. కానీ, అంతలోనే ఎన్నికలు రావడంతో పవన్ కల్యాణ్ చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చేశాడు.
హిట్ కాంబోలో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీపై ఎన్నో అంచనాలు ఉండడంతో అందుకు తగ్గట్లుగానే అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నటీనటుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ చిత్రం పవన్ కల్యాణ్ కాకుండా ఇంకో స్టార్ హీరో కోసం హరీష్ శంకర్ ఓ రోల్‌ను డిజైన్ చేసినట్లు తెలిసింది.

ఎంతో హైప్ నడుమ రూపొందుతోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో మరో హీరో పాత్ర కూడా ఉంటుందట. దీనికోసం బాలీవుడ్‌కు చెందిన పాన్ ఇండియా హీరోను తీసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. ఇందుకోసం ఇద్దరు ముగ్గురు హీరోల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ పాత్ర పవన్ కల్యాణ్‌కు సాయం చేసేలా ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా, 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది 'తేరీ' మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఇందులో అశుతోష్ రాణా, గౌతమి, నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్‌లు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications










