SS Rajamouli: జక్కన్నా.. మహేశ్‌కే పిచ్చెక్కి పోతారనుకున్నాం.. కానీ మళ్లీ ఆ స్టార్ హీరో కూడానా ?
ఎస్ఎస్ రాజమౌళి.. కెరియర్ లో ఒక్క ఫ్లాప్ లేదు.. చేసింది కొన్ని సినిమాలే కానీ.. భారతీయ సినిమా రేంజ్ ఏంటో ప్రపంచానికి చూపించాడు. ప్రతి భారతీయులు గర్వపడేలా చేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఓ పాటకు ఆస్కార్ రావడంతో.. ఆయన వరల్డ్ వైడ్ పాపులర్ డైరెక్టర్స్ లో ఆయన ఒకరు అయ్యారు. అలాంటి దర్శకుడు ఇప్పుడు తీయబోయే నెక్ట్స్ సినిమా గురించి అందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్టు గురించి మరో ఆసక్తి కర విషయం బయటకు వచ్చింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు రాజమౌళి. ఇక జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్టు గురించి ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. ఇక ఈ సినిమా గురించి ఏదో ఒక గాసిప్ వస్తూనే ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి.. మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఒక్క పోస్టర్ రిలీజ్ కాలేదు.. టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు.. అప్పుడే ఈ సినిమా గురించి హైప్స్ మామూలుగా లేవు.

ఇక ప్రస్తుతం మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా ఆకట్టుకుంది. ఇక తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా.. పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు వచ్చే సంక్రాంతికి రానుంది ఈ మూవీ.
ఇక గుంటూరు కారం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా అయిపోతే మహేశ్ బాబు పూర్తి స్థాయిలో రాజమౌళికి అందుబాటులో ఉంటారని సమాచారం. ఇక రాజమౌళి సినిమా అంటే.. కనీసం మూడేళ్లు అయినా పడుతుంది. మరి మహేశ్ బాబుతో ఓ ప్రాంచైజీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు దుర్గా ఆర్ట్స్‌బ్యానర్ పై కేఎల్ నారాయణ వెయ్యి కోట్లతో ఈ మూవీని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

ఇక రాజమౌళి మహేశ్ సినిమా కోసం.. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజి బిజిగా ఉన్నారట. అంతే కాదు ఈ సినిమా కోసం లొకేషన్స్ వెతుకుతున్నారని సమాచారం. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఓ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాను ప్రాంచైజీగా కూడా మలిచే ఆలోచనలో రాజమౌళి ఉన్నారు. అయితే ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.
ఈ సినిమాలో మహేశ్ అడవుల్లో తిరుగుతుంటే మరో పాత్ర గైడ్ చేస్తుందట. అయితే ఆ గైడ్ చేసే పాత్ర కోసం మరో హీరోను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అది ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో అంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే మహేష్ బాబుకి సినిమా మొత్తం ఉండే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం తమిళ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు హీరోలను తీసుకోబోతున్నట్లు సమాచారం. మరి ఇదే నిజమైతే... ఇక సినిమా నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











