ఆచార్య నుంచి మరో పవర్ఫుల్ స్టిల్.. చరణ్ భుజంపై మెగాస్టార్ హ్యాండ్.. ఎదురుగా AK47

మెగా అభిమానులకు ఈ ఏడాది ఒక బిగ్ ఫెస్టివల్ అనే చెప్పాలి. ఉప్పెన సినిమాతో మేనల్లుడు ఇప్పటికే పవర్ఫుల్ బాక్సాఫీస్ రుచి చూపించాడు. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తరువాత రాబోయే ఆచార్య పైన కూడా అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమాకి సంబంధించిన ఒక స్టిల్ ను రిలీజ్ చేశాడు చరణ్.

మెగాస్టార్ సలహా వలన..

మెగాస్టార్ సలహా వలన..

ఆచార్య సినిమాపై అంచనాలు రోజురోజుకు తారా స్థాయికి చేరిపోతున్నాయి. ఇక సినిమాలో రామ్ చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. మొదట ఏదో 30 నిమిషాల గెస్ట్ రోల్ అనుకున్నారు. కానీ మెగాస్టార్ సలహాలు మేరకు కొరటాల కథలో మార్పులు చేయలేక తప్పలేదట.

స్టూడెంట్ లీడర్ గా చరణ్ రోల్

స్టూడెంట్ లీడర్ గా చరణ్ రోల్

రామ్ చరణ్ సిద్దా అనే స్టూడెంట్ యూనియన్ లీడర్ గా కనిపించబోతున్నాడు. చరణ్ సెకండ్ హాఫ్ మొత్తం కనిపిస్తాడని తెలుస్తోంది. దాదాపు సినిమాలో గంటకు పైగా ఉంటాడట. ఇక దీన్ని మల్టీస్టారర్ అనకుండా ఉండలేకపోతున్నారు అభిమానులు. దర్శకుడు కొరటాల చరణ్ కోసం ఇప్పటికే చాలా మార్పులు చేశాడు.

కామ్రేడ్ మూమెంట్.

కామ్రేడ్ మూమెంట్.

అయితే రీసెంట్ గా రామ్ చరణ్ మరో స్టిల్ ను విడుదల చేశాడు. చరణ్ బుజంపై మెగాస్టార్ చేయి వేసి ఉండగా వారి ముందు ఒక AK47 లాంటి గన్ను కూడా ఉంది. అంటే సినిమాలో ఇద్దరు కలిసి పోరాటం చేయబోతున్నట్లు తెలుస్తోంది. చరణ్ పెట్టిన కామెంట్ కూడా అలానే ఉంది. " కామ్రేడ్ మూమెంట్. నాన్నతో ప్రతి మూమెంట్ ను ఎంజాయ్ చేస్తున్నాను.." అంటూ చరణ్ ట్వీట్ చేస్తూ అద్భుతమైన ఫొటో వదిలాడు.

చరణ్, చిరు.. కలిసి స్టెప్పులేస్తే..

చరణ్, చిరు.. కలిసి స్టెప్పులేస్తే..

ఇక రామ్ చరణ్ మెగాస్టార్ ఒకే ఫ్రేమ్ లో కనిపించే సీన్స్ సినిమో నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయని చాలా క్లారిటీగా అర్ధమవుతోంది. కేవలం యాక్షన్ సీన్స్ అనే కాకుండా ఇద్దరి హీరోల నడుమ ఒక స్పెషల్ సాంగ్ ను కూడా యాడ్ చేయబోతున్నట్లు సమాచారం. ఆ సాంగ్ తో ఆడియెన్స్ కు గూస్ బంప్స్ రావడం ఖాయమని అంటున్నారు. ఇక మే 14 ఆ ఆచార్య ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X