RRR నుంచి మరో సర్‌ప్రైజ్: స్టార్ హీరో అదిరిపోయే ప్లాన్.. డేట్ ఫిక్స్ చేసిన రాజమౌళి.!

By Manoj Kumar P

RRR.. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ హంగులతో తెరకెక్కుతోన్న చిత్రం. అందుకే ఈ సినిమా చాలా రోజులుగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. దీనికి ప్రధాన కారణం టాలీవుడ్‌లోనే టాప్ డైరెక్టర్‌గా వెలుగొందుతోన్న దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తుండడానికి తోడు ఇందులో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండడమే. ఇప్పటికే ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్ రాబోతుంది. స్టార్ హీరో ప్లాన్ చేయగా.. రాజమౌళి డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఆ వివరాలు మీకోసం.!

టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వాడాడు

టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వాడాడు

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తున్న చిత్రమే RRR. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. దీనికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇందులో అజయ్ దేవగణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, రే స్టీవెన్‌సన్, అలీసన్ డూడీ సహా ఎంతో మంది టాలీవుడ్, హాలీవుడ్ సహా మిగిలిన ఇండస్ట్రీలో వాళ్లు నటిస్తున్నారు.

ఎన్నో సమస్యలు.. అందుకే ఇలాంటి రిజల్ట్

ఎన్నో సమస్యలు.. అందుకే ఇలాంటి రిజల్ట్

RRR రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాదిన్నర పూర్తయింది. అయితే, ఇందులో నటించే హీరోలకు గాయాలు కావడం.. ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం.. ప్రతికూల వాతావరణం.. ఇప్పుడు కరోనా ప్రభావంతో విరామం సహా ఎన్నో ఆటంకాలు ఎదురవడంతో ఈ మూవీ షూటింగ్ ఎనభై శాతం మాత్రమే అయింది. మిగిలిన దాంట్లో ముఖ్యమైన సీన్స్ చిత్రీకరించాల్సి ఉంది.

రాజమౌళిపై ఆగ్రహం.. అందుకే ఈ నిర్ణయం

రాజమౌళిపై ఆగ్రహం.. అందుకే ఈ నిర్ణయం

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మెగా, నందమూరి అభిమానులు సర్‌ప్రైజ్‌ల కోసం వేయి కళ్లతో వేచి చూశారు. కానీ, చిత్ర యూనిట్ నుంచి అలాంటివి ఏమీ రాలేదు. దీంతో వాళ్లంతా రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నాడో ఏమా గానీ ఇటీవల ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఊహించిందే.. అందుకే స్పందన కరువైంది

ఊహించిందే.. అందుకే స్పందన కరువైంది

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్‌లో RRRకు క్యాప్షన్ రివీల్ చేశారు. మొత్తం ఐదు భాషల్లో ఒకే అర్థం వచ్చేలా దీన్ని ఫిక్స్ చేశారు. మరీ ముఖ్యంగా తెలుగులో పెట్టిన ‘రౌద్రం.. రణం.. రుధిరం' టైటిల్ చాలా కాలంగా పరిశీలనలో ఉన్నదే కావడంతో పాటు కరోనా ప్రభావంతో దీనికి స్పందన తక్కువగా వచ్చింది.

సినిమాపై అంచనాలు పెంచిన ఎన్టీఆర్ గిప్ట్

సినిమాపై అంచనాలు పెంచిన ఎన్టీఆర్ గిప్ట్

మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ‘భీమ్ ఫర్ రామరాజు' పేరుతో ఓ సర్‌ప్రైజ్ వీడియోను విడుదల చేశాడు. అందులో రామ్ చరణ్ లుక్‌తో రివీల్ చేశారు. అల్లూరి సీతారామరాజును పరిచయం చేస్తూ ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఓవర్‌ అదిరిపోయింది. దీంతో ఈ వీడియోకు రెస్పాన్స్‌తో పాటు రికార్డ్ వ్యూస్ కూడా వచ్చాయి.

RRR నుంచి మరో సర్‌ప్రైజ్.. డేట్ ఫిక్స్ చేశారు

RRR నుంచి మరో సర్‌ప్రైజ్.. డేట్ ఫిక్స్ చేశారు

రెండు రోజుల వ్యవధిలో రెండు వీడియోలను విడుదల చేసిన RRR యూనిట్ మరో సర్‌ప్రైజ్‌కు డేట్ ఫిక్స్ చేసిందని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ్ చరణ్.. అతడి కోసం ‘రామరాజు ఫర్ భీమ్' పేరుతో ఓ వీడియోను విడుదల చేయాలని ప్లాన్ చేశాడని, దానికి రాజమౌళి ఓకే చెప్పాడనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X