వెరీ ఇంట్రెస్టింగ్: సరిలేరు నీకెవ్వరులో మరో సర్‌ప్రైజ్: క్లైమాక్స్‌లో వాళ్లందరూ ఎంట్రీ ఇస్తున్నారట.!

By Manoj Kumar P

వరుస విజయాలతో దూకుడు మీదున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. తన గత చిత్రాలు 'భరత్ అనే నేను', 'మహర్షి' సూపర్ హిట్ అవడంతో.. ఈ సారి కూడా సక్సెస్ సాధించి హ్యాట్రిక్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలోనే విజయవంతమైన చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడితో కలిశాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్? వివరాల్లోకి వెళితే...

ఇద్దరికీ సరిలేరు అనిపించుకుంటారట

ఇద్దరికీ సరిలేరు అనిపించుకుంటారట

అనిల్ రావిపూడి చేసిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. అలాగే, మహేశ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు'. ఇది కూడా హిట్ కొట్టి తమకు సరిలేరు అనిపించుకునేందుకు ఈ జంట ప్రయత్నిస్తోంది. రష్మిక హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీలో విజయశాంతి, ప్రకాశ్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

వాటికి ఏమాత్రం తగ్గకుండా తీశాడు

వాటికి ఏమాత్రం తగ్గకుండా తీశాడు

ఈ సినిమాను మహేశ్ బాబు ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని తెరకెక్కించాడు అనిల్ రావిపూడి. సూపర్ వరుసగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుండడంతో ఈ సారి ఆయనను సరికొత్తగా చూపించాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే తన మార్క్ తగ్గకుండా ఉండేలా.. మహేశ్‌తో ఫుల్‌గా కామెడీని పండించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో అది స్పష్టమైంది.

అంచనాలు రెట్టింపు అవడానికి అవే కారణం

అంచనాలు రెట్టింపు అవడానికి అవే కారణం

సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్‌డేట్‌ వచ్చినా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది. అంతలా వీటిని ఫ్యాన్స్‌తో పాటు సామాన్య ప్రేక్షకులు ఆదరించారు. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు, టీజర్, ట్రైలర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు, వ్యూస్ పరంగానూ వీటిలో కొన్ని రికార్డు క్రియేట్ చేశాయి.

సూపర్ స్టార్ సినిమాలో సూపర్ స్టార్

సూపర్ స్టార్ సినిమాలో సూపర్ స్టార్

మహేశ్ బాబు నటించిన ఈ సినిమాలో ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కనిపించబోతున్నారని ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించాడు. దీంతో దీనిపై ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ సినిమాలోని మైండ్ బ్లాక్ అంటూ సాగే పాటలో కృష్ణ లుంగీ పంచెతో ఎంట్రీ ఇస్తారని ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ఎంట్రీ కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా క్రియేట్ చేశారని కూడా అంటున్నారు.

క్లైమాక్స్‌లో వాళ్లందరూ ఎంట్రీ ఇస్తున్నారట.!

క్లైమాక్స్‌లో వాళ్లందరూ ఎంట్రీ ఇస్తున్నారట.!

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమా క్లైమాక్స్‌లో చిత్రంలోని నటీనటులతో పాటు టెక్నీషియన్లు సిగ్నేచర్ స్టెప్ వేస్తారట. ట్రైలర్‌లో చూపించిన ‘మియ్యాం మియ్యాం పిల్లి' అంటూ సాగే దానిని యాక్ట్ చేస్తూ వీళ్లంతా కనిపించబోతున్నారని అంటున్నారు. అయితే, ఇది శుభం కార్డ్ పడిన తర్వాత ఉంటుందని టాక్.

రాజమౌళి సినిమాలో కూడా ఇలాగే

రాజమౌళి సినిమాలో కూడా ఇలాగే

దర్శకధీరుడు రాజమౌళి - రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘మగధీర' సినిమా ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకు ఉన్న రికార్డలన్నింటినీ ఈ మూవీ తిరగరాసింది. ఈ సినిమా శుభం కార్డ్ పడిన తర్వాత ఓ పాటను పెట్టారు. అందులో హీరో, డైరెక్టర్ సహా నటీనటులు, టెక్నీషియన్లు సిగ్నేచర్ మూమెంట్ వేసి మెప్పించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X