రాధేశ్యామ్ నుంచి మరో టీజర్ రెడీ.. స్పెషల్ డేట్ ఫిక్స్ చేసుకున్న ప్రభాస్!
టాలీవుడ్ రెబల్ స్టార్ మొత్తానికి రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన మొదటి టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ 42 పుట్టినరోజు సందర్భంగా యు.వి.క్రియేషన్స్ ఒక సరికొత్త టీజర్ విడుదల చేస్తుందని ఎవరు ఊహించలేదు. మొత్తానికి టీజర్ అయితే అభిమానులకు బాగా నచ్చింది. న్యూ లవ్ స్టోరీ అని చెప్పిన ఈ చిత్ర యూనిట్ సభ్యులు సినిమా ఎంతో థ్రిల్లింగ్ గా కూడా చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. జిల్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. అయితే ప్రమోషన్ విషయంలో మాత్రం నిర్మాతలు కాస్త నెమ్మదిగా వెళ్లడంతో అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది.
అయితే ఇప్పటి నుంచి ఈ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యే విధంగా ప్రమోషన్స్ డోస్ పెంచాలని చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తప్పకుండా పండగల సమయంలో ఏదో ఒక సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు.
రాధేశ్యామ్ సినిమా షూటింగ్ అయితే దాదాపు పూర్తయింది. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే కొన్ని మిగిలి ఉన్నాయి. దర్శకుడు రాధాకృష్ణ ప్రస్తుతం ఆ పనుల్లో అయితే చాలా బిజీగా ఉన్నాడు. వీలైనంతవరకూ నెమ్మదిగానే వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అసలైతే రాధేశ్యామ్ సినిమాను ఈ ఏడాది సమ్మర్లో విడుదల చేయాలని అనుకున్నారు. కుదరకపోతే దసరా సమయంలో అయినా భారీ స్థాయిలో విడుదల చేయాలని ఆలోచించారు.

కానీ కరోనా ప్రభావం అలాగే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల రేట్లు వివాదం కూడా సినిమా విడుదలపై చాలా ప్రభావం చూపించింది. అంతేకాకుండా కొన్ని సీన్స్ విషయంలో కూడా ప్రభాస్ అప్సెట్ అయ్యాడు అని అందుకే రీషూట్ చేశారని కూడా టాక్ వచ్చింది. మొత్తానికి ఏదో ఒక విధంగా సినిమా పూర్తవడానికి అయితే చాలా ఆలస్యం అయ్యింది అనే చెప్పాలి. ఇక ఈ సినిమాను ఫైనల్ గా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. పోటీగా పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ యు.వి.క్రియేషన్స్ విడుదల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు.
జనవరి 14 అని ఒక డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఆ విషయాన్ని టీజర్ లోనే చాలా క్లారిటీగా చెప్పేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరొక టీజర్ ను దీపావళి సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రభాస్ పుట్టిన రోజున వారు కేవలం విక్రమాదిత్య కు సంబంధించిన విజువల్స్ మాత్రమే విడుదల చేశారు. ఇక తదుపరి టీజర్ లో మాత్రం పూజా హెగ్డే ప్రభాస్ ఇద్దరు ఉన్న కొన్ని సీన్స్ ను కూడా కూడా హైలెట్ చేయాలని చూస్తున్నారు. దీపావళి సందర్భంగా తప్పకుండా సినిమాకు సంబంధించిన ప్రత్యేకమైన టీజర్ ను అందించాలని ఆలోచిస్తున్నారు. మరి ఆ టీజర్ తో చిత్ర యూనిట్ సభ్యులు ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











