సామ్ - చై గురించి మరువనే లేదు.. అప్పుడే తెరమీదకి మరో విడాకుల వ్యవహారం.. నిముషం కూడా పడడం లేదంటూ!

సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారం ఇంకా మరిచిపోకముందే టాలీవుడ్లో మరో విడాకుల వ్యవహారం తెర మీదకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. టాలీవుడ్ యువ జంట మధ్య విభేదాలు మొదలయ్యాయి అని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏం జరిగింది ? ఎందుకు వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి ? అనే వివరాల్లోకి వెళితే

అప్పుడే మరో విడాకులు

అప్పుడే మరో విడాకులు

టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల ప్రకటన ఒక రకంగా టాలీవుడ్ ప్రేక్షకులు అందరికి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇద్దరూ విడిపోతున్నారు అని చాలా కాలం నుంచి ప్రచారం జరిగినా ఎవరూ నమ్మలేదు కానీ వాళ్ళిద్దరూ అధికారికంగా ప్రకటించే సరికి షాక్ అయిన పరిస్థితి కనిపించింది. వారి విడాకుల ప్రకటన వచ్చి నెల కూడా గడవలేదు అప్పుడే మరో టాలీవుడ్ జంట విడి పోయే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు ప్రచారం మొదలైంది.

కామన్ అయిపోయింది

కామన్ అయిపోయింది

టాలీవుడ్ తారల ప్రేమ పెళ్లిళ్లు చాలా కామన్. టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం, హీరోలు బయటివాళ్ళను ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం, అలాగే హీరోయిన్లు బయటి వాళ్ళను ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం చాలా కామన్ అయి పోయింది. అయితే ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో?, ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఇద్దరు సినిమా రంగంలో ఉన్న వాళ్ళే విడి పోతుంటే బయట వాళ్ళు కూడా అదే దారిలో నడుస్తున్నారు.

 విడాకుల బాటలో

విడాకుల బాటలో

ప్రేమ పెళ్లి చేసుకున్న ఒక టాలీవుడ్ హీరో ఇప్పుడు విడాకులు దారిలో పయనిస్తున్నారు అనే వార్త టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. చాలా కాలం తర్వాత మళ్ళీ సినిమాలతో మంచి ఫాంలోకి వచ్చిన సదరు టాలీవుడ్ హీరో చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. అయితే ఇదే సమయంలో భార్యతో విభేదాలు మొదలయ్యాయి అని సమాచారం.

అందుకే సినిమాల మీద దృష్టి

అందుకే సినిమాల మీద దృష్టి

అందుకే ఎక్కువగా తన సినిమాల మీద దృష్టి పెట్టి తన పర్సనల్ జీవితం సినిమాల మీద ఏమాత్రం ప్రభావం చూపించకుండా ఉండేందుకు సదరు టాలీవుడ్ హీరో విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చాలా కాలం పాటు హిట్స్ లేక ఇబ్బంది పడిన సదరు టాలీవుడ్ హీరో ఈ మధ్య కాలంలోనే మంచి హిట్ సినిమాలు అందుకుని చేతి నిండా సినిమాలతో ఉన్నాడు.

విభేదాలు ఎందుకు?

విభేదాలు ఎందుకు?

అయితే వారి మధ్య విభేదాలకు కారణాలు ఏమిటి అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు కానీ చిన్న చిన్న మాట తేడాల తోనే గొడవలు పెద్దవి అవుతున్నాయని తెలుస్తోంది.. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ టాలీవుడ్ హీరో కూడా త్వరలోనే అధికారికంగా విడాకులు ప్రకటించే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది.

Recommended Video

Bigg Boss Telugu 5 : Elimination నాట్ ఈజీ.. Shannu కోసం ఉంచుతారా? || Filmibeat Telugu
వాళ్ళ ఇష్టం కదా

వాళ్ళ ఇష్టం కదా

ఇక టాలీవుడ్ లో విడాకులు తీసుకుని రెండో వివాహం చేసుకున్న జంటలు కూడా చాలా ఉన్నాయి. సో కలిసి బ్రతకలేము అనుకుంటున్నప్పుడు విడిపోవడమే మేలు అని టాలీవుడ్ కపుల్స్ భావిస్తున్నాయి. కొన్నాళ్ల పాటు చర్చ జరుగుతుంది ఆ తర్వాత ఎవరి జీవితాలు వారివి. పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి ఎక్కువ వారి గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ పర్సనల్ లైఫ్ ఎలా గడపాలి అన్నది వారి ఇష్టమే కదా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X