విడాకుల దిశగా మరో టాలీవుడ్ హీరో.. అంతా అయిపొయింది.. ఇక అధికారికంగా ప్రకటించడమే?

ఇవాళ్టి రోజుల్లో విడాకులు అనేది చాలా సర్వసాధారణం అయింది. సామాన్యులు సహా సినిమా వాళ్లు, క్రికెట‌ర్లు, ఇత‌ర రంగాల్లో పేరు ప్ర‌ఖ్యాతులు పొందే వాళ్ళు అంతెందుకు మనుషులు అన్నాక విడాకులు సాధారణం కానీ సినీ సెలబ్రిటీల విడాకుల వ్య‌వ‌హారాలు త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటాయి. వారి పెళ్లిళ్ల గురించి ఎన్ని వార్త‌లు వ‌స్తాయో, విడాకుల గురించి కూడా అంత‌కు మించి వార్త‌లు వ‌స్తూ ఉంటాయి. బాలీవుడ్ తో మొద‌లుపెడితే, స్టార్ హీరోల‌తో మొద‌లుపెడితే, చోటామోటా సెల‌బ్రిటీలు కూడా విడాకుల‌తో వార్త‌ల్లోకి ఎక్కుతూ ఉంటారు. టాలీవుడ్ కూడా దీనికి మిన‌హాయింపు కాదు. ఇప్పుడు ఒక టాలీవుడ్ హీరో విడాకులు తీసుకోబోతున్నాడని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

 టాలీవుడ్ లో కూడా కామన్

టాలీవుడ్ లో కూడా కామన్

ఒకప్పుడు హాలీవుడ్‌ సినీ తారల ప్రేమ వివాహాలు మరియు బ్రేకప్ లు చాలా కామన్ గా ఉండేవి. ఆ తర్వాత బాలీవుడ్‌ స్టార్స్ ప్రేమ పెళ్లిలు మరియు విడాకుల విషయం నార్మల్‌ అయ్యింది. బాలీవుడ్‌ లో ఎంతో మంది స్టార్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వారే విడాకులు తీసుకున్నారు. ప్రేమ వివాహాలు చేసుకున్న వారు విడాకులు తీసుకుని ఎవరికి వారు అన్నట్టుగా జీవితం సాగిస్తున్నారు.

ఒకటిరెండు రోజుల్లో

ఒకటిరెండు రోజుల్లో

ఇప్పటికి కూడా బాలీవుడ్‌ స్టార్స్ పలువురు విడాకులకు సిద్దంగా ఉన్నారు.. ఇటీవల కూడా కొందరు విడాకులు తీసుకున్న సందర్భాలు, వాటిని ధైర్యంగా వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. అందుకే బాలీవుడ్‌ లో విడాకులు అంటే అదొక వార్త మాత్రమే. ఒకటిరెండు రోజుల్లో జనం ఆ వార్తను మరిచే పోతున్నారు. ఈ మధ్య టాలీవుడ్ సహా సౌత్ లో కూడా వరుసగా విడాకుల వార్తలు వినాల్సి వస్తుంది. గత ఏడాది సమంత మరియు నాగ చైతన్య విడి పోతున్నట్లుగా ప్రకటించారు.

బాలీవుడ్ లో సత్తా

బాలీవుడ్ లో సత్తా

నాగ చైతన్య- సమంత జంట తర్వాత ధనుష్-ఐశ్వర్య జంట విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే వారిని క‌లిపేందుకు ఐశ్వ‌ర్య తండ్రి ర‌జ‌నీకాంత్, ధనుష్ తండ్రి కస్తూరి రాజా శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరో టాలీవుడ్ హీరో తన భార్య నుంచి విడిపోతున్నారు. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత బాలీవుడ్ కు కూడా వెళ్లిన సదరు హీరో కొన్నాళ్ల పాటు బాలీవుడ్ లో కూడా సత్తా చాటాడు.

 విడాకుల కోసం దరఖాస్తు

విడాకుల కోసం దరఖాస్తు

అయితే సదరు హీరో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్ప‌ట్లో లీడింగ్ హీరోగా ఉన్న ఆయన ఈ మధ్య సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. యాభై ఏళ్ళు పైబడిన హీరో చాలా త‌క్కువ మంది కుటుంబ స‌భ్యుల‌ సమక్షములోనే సినీ పరిశ్రమకు చెందిన ఓ న‌టిని వివాహం చేసుకున్నాడు. స‌ద‌రు హీరో ఒక‌ప్పుడు విల‌న్ గా కెరీర్‌ను ప్రారంభించారు

 40 దాటాక వివాహం

40 దాటాక వివాహం


త‌రువాత ఆ హీరో హై ప్రొఫైల్ సినిమాల్లో కూడా న‌టించారు. బాలీవుడ్ కు వెళ్లి అక్కడ కూడా సినిమాలు చేశారు. వరుస ఫ్లాప్ సినిమాలు ఎదురుకావడంతో కాస్త దూరంగానే ఉంటున్నారు. 50 ఏళ్ల‌ సదరు హీరో 40 దాటాక వివాహం చేసుకున్నారు. ఆరు ఏళ్ల వివాహ జీవితం అనంత‌రం తాజాగా ఆ జంట విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే విడాకులు అధికారికంగా వస్తాయని అవి వచ్చాక అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X