ఎన్టీఆర్, నితిన్ తరువాత ఆ యువ హీరోతో బీజేపీ నేత మీటింగ్.. ఎందుకంటే?

ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడు లేని విధంగా స్టార్ హీరోలు రాజకీయ నాయకులు కలుసుకుంటూ ఉండడం చర్చనీయాంశంగా మారుతొంది. ముఖ్యంగా అందులోనూ భారతీయ జనతా పార్టీకి చెందిన జాతీయ నేతలు తెలుగు హీరోలను ప్రత్యేకంగా కలుసుకొని మాట్లాడటం కూడా చర్చ చర్చనీయాంశంగా మారింది. అయితే రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్, నితిన్ లను కలిసిన తర్వాత మరొక బీజేపీ నేత ఇప్పుడు మరొక టాలీవుడ్ హీరోను కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

మొదట ఎన్టీఆర్

మొదట ఎన్టీఆర్

భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు తెలుగు చిత్ర పరిశ్రమంలోని హీరోలను కలుసుకునెందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ మధ్య అమిత్ షా మునుగోడులో బహిరంగ సభకు వచ్చినప్పుడు హైదరాబాదులోనే ప్రత్యేకంగా ఒక స్టార్ హోటల్లో జూనియర్ ఎన్టీఆర్ ను కలుసుకున్నాడు. వారిద్దరూ అరగంటకు పైగా మాట్లాదుకున్నారు.

 అందుకే కలిశారు

అందుకే కలిశారు

అమిత్ షా ఎన్టీఆర్ ను అలా కలవడంతో బహుశా బీజేపీలో చేరేందుకు అయ్యి ఉంటుందని కథనాలు వెలువడ్డాయి. కానీ అందులో నిజం లేదని RRR సినిమాలో కొమరం భీమ్ పాత్రలో అతను అద్భుతంగా నటించడం వల్లనే అమిత్ షా ప్రశంసించడానికి కలిసినట్లుగా కొంతమంది బిజెపి నేతలు తెలియజేశారు.

 నితిన్ కలయికపై డౌట్స్

నితిన్ కలయికపై డౌట్స్

అయితే అమిత్ షాను కలుసుకున్న తర్వాత అదే పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరొక టాలీవుడ్ హీరోయిన్ కలుసుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. యువ హీరో నితిన్ ను స్పెషల్ గా ఎయిర్ పోర్ట్ దగ్గర కలుసుకున్నారు. ఆ విషయం కూడా అందరిలోనూ ఆసక్తిని కలిగించింది. అయితే జేపీ మరొక హీరోను కలవాలని అనుకోగా పొరపాటున బిజెపి నేతలు నితిన్ ని పిలిచారు అని కథనాలు కూడా వచ్చాయి.

 అందులో నిజం లేదు

అందులో నిజం లేదు

అయితే నితిన్ ను కలవడం పై వచ్చిన కొన్ని రుమర్స్ లో మాత్రం ఎలాంటి నిజం లేదు అని ఆ తర్వాత మరి కొంతమంది బిజెపి ప్రముఖులు వివరణ ఇచ్చారు. కార్తికేయ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నితిన్ కలుసుకోవాలని అనుకున్న జేపీ నడ్డా దగ్గరకు పొరపాటున ఆ పార్టీ ప్రముఖులు నితిన్ ని పిలిచారు అనే టాక్ వచ్చింది. కానీ ఇది పొరపాటు ఏమి కాదు అని నితిన్ నే ఆయన కలుసుకోవాలని అనుకున్నట్లుగా మరికొందరు వివరణ ఇచ్చారు.

ఇప్పుడు నిఖిల్ తో..

ఇప్పుడు నిఖిల్ తో..

శ్రీకృష్ణ పరమాత్మ మిస్టార్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన కార్తికేయ 2 సినిమాతో ఇటీవల నిఖిల్ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు అందుకున్నాడు. హిందూ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తించే విధంగా సినిమా చేసినందుకు గాను ప్రత్యేకంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నిఖిల్ ను కలవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అమిత్ షా, నిఖిల్ కలయిక కోసం బిజెపి స్థానిక నేతలు ఏర్పాట్లు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X