SSMB 28: మరో సమస్యలో చిక్కుకున్న త్రివిక్రమ్.. ఇలా అయితే సంక్రాంతికి కష్టమే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే మొదట ఈ సినిమాను ఎనౌన్స్ చేసినప్పుడు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. కానీ సినిమా షూటింగ్ కొనసాగుతున్న కొద్ది అంచనాల స్థాయి మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఎప్పుడు ఈ సినిమాకు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కు మరొక సమస్య ఎదురైనట్లు సమాచారం. ఆ సమస్య నుంచి వీలైనంత త్వరగా బయటపడకపోతే సినిమా అనుకున్న తేదీకి రావడం కష్టమే అని తెలుస్తోంది. ఆ వివరాలలోకి వెళితే..

చాలా మార్పులు కావాలని..: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత తొందరగా పెళ్లి చేసేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉంటాడు. అయితే మహేష్ బాబు సినిమా విషయంలో మాత్రం ఆయన ఎంతగా ప్రణాళిక రచించుకున్న కూడా వర్కౌట్ కావడం లేదు. అసలు ఈ సినిమాను ఈ ఏడాదిలోనే దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ విషయంలో మహేష్ బాబు చాలా మార్పులు కావాలని అడగడంతో త్రివిక్రమ్ వెనకడుగు వేకతప్పడం లేదు.

 SSMB 28

అదే తరహాలో ఇబ్బందులు: అసలైతే మొదట అనుకున్న కథను మహేష్ బాబు ఒక షెడ్యూల్ లో పూర్తి చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇక తర్వాత మరొక కథను మొదలు పెట్టినప్పటికీ కూడా దానికి కూడా అదే తరహాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత మహేష్ బాబు మళ్లీ మరొక షెడ్యూల్లో మొదలుపెట్టే క్రమంలో మరికొన్ని సన్నివేశాలు విషయంలో అభ్యంతరాలు చెప్పినట్లుగా తెలుస్తోంది.

మహేష్ బాబు తిరిగి వచ్చే క్రమంలో..: స్క్రిప్ట్ విషయంలో కొన్ని సీన్స్ మార్చుకోవాలి అని అప్పటిలోపు సమ్మర్ హాలిడేస్ కు వెళ్లి వస్తాను అని మహేష్ బాబు ఇటీవల త్రివిక్రమ్ తెలియజేసినట్లు ట్లాక్ వచ్చింది. అయితే ఇప్పుడు మహేష్ బాబు తిరిగి వచ్చే క్రమంలో త్రివిక్రమ్ కు మరొక సమస్య ఎదురుకాబోతున్నట్లు సమాచారం. ఆ సమస్యను బయటకు రాకుంటే సినిమా వచ్చే సంక్రాంతికి రాకపోవచ్చని టాక్ వస్తోంది.

 SSMB 28

మరో సమస్య ఎదురైంది: మహేష్ బాబు అనుకున్న సమయానికి వస్తానని చెప్పినప్పటికీ మిగతా ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ అయ్యే అవకాశం లేనట్లు తెలుస్తోంది. అసలైతే ఈపాటికి సినిమా మూడవ షెడ్యూల్ కూడా పూర్తి కావాలి. ముందుగానే ఆర్టిస్టులను కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మహేష్ ప్లాన్ చేంజ్ అవ్వడం వలన మిగతా ఆర్టిస్టుల డేట్స్ దొరకడం లేదని తెలుస్తోంది. ఇక చిత్ర యూనిట్ సభ్యులు ఈ సమస్య నుంచి వీలైనంత తొందరగా బయట పడాలని చూస్తున్నారు.

 SSMB 28

మరో సినిమా స్టార్ట్ చేయాలి..: మరోవైపు మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక సినిమా మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది చివరలో ఆ సినిమా వర్క్ షాప్ లో కూడా మహేష్ పాల్గొనాల్సి ఉంది. అందుకే వీలైనంత తొందరగా త్రివిక్రమ్ సినిమాను ఫినిష్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ త్రివిక్రమ్ ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏదో ఒక రకంగా సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. మరి ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి ఫినిష్ అవుతుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X