SSMB 28: మహేష్ బాబుతో పోటీకి సిద్ధమైన మరో ఇద్దరు సూపర్ స్టార్స్.. ఆ సమయంలో బిగ్ క్లాష్!

రాబోయే రోజుల్లో మరికొన్ని పెద్ద సినిమాల మధ్యలో ఊహించని స్థాయిలో పోటీ ఉండబోతుంది అని అర్థమవుతుంది. ముఖ్యంగా సమ్మర్ లోనే కాకుండా ఆ తర్వాత పండగ సీజన్లకు కూడా పెద్ద సినిమాలు బాగానే టార్గెట్ చేశాయి. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న ప్రాజెక్టుపై కూడా ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల మొదలైంది. పూజ హెగ్డే మేయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల మరొక హీరోయిన్ పాత్రకోసం సెలెక్ట్ అయ్యింది. ఇక వివిధ రకాల ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.

ఇక ఈ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకొని మళ్ళీ రాజమౌళి సినిమాకు రెడీ అవ్వాలి అని మహేష్ బాబు ఎదురు చూస్తున్నాడు. అయితే మహేష్ బాబు సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి ఆగస్టు 11వ తేదీన విడుదల చేయాలని నిర్మాణ సంస్థ ఒక టార్గెట్ అయితే పెట్టుకుంది. అయితే అదే సమయంలో మరికొన్ని పెద్ద సినిమాలు కూడా ఇండస్ట్రీ నుంచి తెలుగులో కూడా పోటీకి సిద్ధమయ్యాయి.

Another two big movies target on Mahesh babu Movie release date

ఆ రెండు సినిమాలు కూడా ఫ్యాన్ ఇండియా లెవెల్ లోనే విడుదలవుతూ ఉండడం విశేషం. ఇక మహేష్ బాబు సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ కు తగ్గట్టుగానే విడుదల చేయాలని ఒక ప్లాన్ అయితే వేస్తున్నారు. ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్ బీర్ కపూర్ నటించిన ఎనిమల్ సినిమా కూడా అదే తేదీన రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాకు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. ఈ మూడు సినిమాలు కూడా సౌత్ లో అయితే భారీ స్థాయిలోనే విడుదల కాబోతున్నాయి. మరి పోటీలో మహేష్ బాబు ఎంతవరకు నిలదొక్కుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X