ప్రభాస్ హృతిక్ రోషన్ కాంబినేషన్ నిజమే కానీ.. మరో చిన్న ట్విస్ట్!
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో మంచి అవకాశాలను అందుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లైనప్ లో ఉన్న ప్రాజెక్టులలో ప్రతి ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలోనే సక్సెస్ అవుతుంది అనే ఫ్యాన్స్ అయితే చాలా నమ్మకంతో ఉన్నారు. ఇక ప్రభాస్ ఈ ఏడాది మరికొన్ని కొత్త కాంబినేషన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.
అంతేకాకుండా ప్రభాస్ మల్టీస్టారర్ సినిమాలలో కూడా నటించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరో హృతిక్ రోషన్ తో కూడా ప్రభాస్ ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదివరకే ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రభాస్ తో సినిమా చేసేందుకు చర్చలు అయితే జరిపింది. అయితే ఎలాంటి సినిమా చేయాలా అని.. కొత్త ప్రాజెక్టులపై చర్చలు జరుపుతున్న సమయంలో వార్ దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ చేసిన ఒక ఐడియా ఇచ్చాడాట.

అతని ఆలోచనా విధానంతో ఇప్పుడు ప్రభాస్ మరొక హీరో సినిమాలో నటించబోతున్నాడట. సిద్ధార్థ ఆనంద్ హృతిక్ రోషన్ సినిమాలో నటించడం వాస్తవమే కానీ ట్విస్ట్ ఏమిటి అంటే ప్రభాస్ కేవలం గెస్ట్ పాత్రలోనే కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కేవలం ఒక 20 నిమిషాల పాత్రలో ప్రభాస్ అందులో హై వోల్టేజ్ యాక్షన్ పాత్రలో కనిపిస్తాడని కథనాలు వెలువడుతున్నాయి. హృతిక్ రోషన్ ప్రభాస్ వెండితెరపై కనిపిస్తే చూడాలి అనే ఫ్యాన్స్ అయితే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు అర్థమవుతుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ కాంబినేషన్స్ పై అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక యష్ రాజ్ ఫిలిమ్స్ మాత్రం పూర్తిస్థాయిలో స్క్రిప్టు సిద్ధమైన తర్వాతనే ఈ కాంబినేషన్ పై అఫీషియల్ క్లారిటీ ఇవ్వాలని అనుకుంటుంది. మరి ఆ ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











